rains: వర్షం…. హర్షం
నైరుతి రుతుపవనాల రాక చురుగ్గా ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సమయంలోనే జిల్లాలో గురువారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం
సేద తీరిన సామాన్య జనం
రైతులకు ఊరట
సగటున 25.2 మిల్లీమీటర్ల వర్షం
ప్రజా దీవెన నల్లగొండ: నైరుతి రుతుపవనాల రాక చురుగ్గా ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సమయంలోనే జిల్లాలో గురువారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు నల్లగొండ(Nalgonda)జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల సామాన్యులు ఊరట చెందారు. వర్షం రావడం పట్ల రైతులు(farmers) హర్షం వ్యక్తం చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఏక దాటిగా పడింది. భారీ వర్షానికి పల్లపు ప్రాంతాల్లో, పట్టణంతోపాటు పలు గ్రామాల్లో రోడ్లపై నీరు చేరింది.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 807.2 మిల్లీమీటర్ల వర్షపాతం.. సగటున 25.2 శాతం వర్షం నమోదయింది.కాగా కనగల్ మండలం లో అత్యధికంగా 110.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అతి తక్కువగా మాడుగుల పల్లి లో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది.
నల్లగొండ(Nalgonda) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, మర్రిగూడ మండలం ఎర్రగడ్లపల్లిలో మాత్రమే సుమారు 1000 క్వింటాల ధాన్యం ఉందని, కొనుగోలు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి అయిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. వర్షం పడినప్పటికీ ధాన్యాన్ని టార్పారిన్ల తో కప్పి ఉంచామని ధాన్యం తడవలేదని, ఎలాంటి డ్యామేజ్ కాలేదని తెలిపారు.
నమోదైన వర్షం….
నిడమనూరు 3.8 మిల్లీమీటర్లు, తిప్పర్తి 37.5, మాడుగుల పల్లి 1.5, నాంపల్లి 64.8, మిర్యాలగూడ 6.0, కట్టంగూరు 13.5, గుర్రంపోడు 57.8, తిరుమలగిరి సాగర్ 5.0, హాలియా 10.3, నార్కెట్పల్లి 12.3, త్రిపురారం 5.3, నకిరేకల్ 26.8, చిట్యాల 61.2, అడవిదేవులపల్లి 15.0, చందంపేట 8.3, వేములపల్లి 5.0, పెద్ద ఆడిశర్ల పళ్లి 42.3, మునుగోడు 26.0, దామరచర్ల 5.3, కొండమల్లేపల్లి 35.5, దేవరకొండ 31.0, చండూరు 30.3, శాలిగౌరారం 24.3, నల్లగొండ 56.3, కేతేపల్లి 89.3, కనగల్ 110.5, చింతపల్లి 49.3, మర్రిగూడెం 9.2, గట్టుపల్ 7.5, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
rains in nalgonda