Rajiv Gandhi death Anniversary : ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
సాంకేతిక విప్లవానికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సాంకేతిక విప్లవానికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ(Rajiv Gandhi ) అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాల యంలో భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ( Rajiv Gandhi 33th death Anniversary) 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి(tribute) నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ(IT)రంగానికి పునా దులు వేయడంతో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాడని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు.ఆయన ఆశ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో కౌన్సిలర్ బొజ్జ శంకర్, నాయకు లు జూలకంటి సైదిరెడ్డి, కన్నారావు, దుబ్బ మధు, గురిజ వెంకన్న, పిల్లి రమేష్ యాదవ్, నల్లగొండ అశోక్, గోగుల గణేష్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్య క్షుడు గాలి నాగరాజు, మామిడి కార్తీక్, నాగేశ్వరరావు, కంచర్ల ఆనంద్ రెడ్డి, జహంగీర్, బైరు ప్రసాద్, జావిద్, వనపర్తి రామ్, సర్వర్, అజ్జు ,సాయిరాం తది తరులు పాల్గొన్నారు.
Rajiv Gandhi death Anniversary