Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
ప్రజా దీవెన, కోదాడ: భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతి(Rajiv Gandhi Birth Anniversary) సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వంగవీటి. రామారావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం దేశానికి అంకితం చేశాడని యువతకు ఎన్నో మార్గదర్శకాలను దిశానిర్దేశం చేసి పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని తెలిపారు.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని(Science and technology) యువతకు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని రాజీవ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినట్లయితే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు. పాండురంగారావు, మాజీ సర్పంచ్, డిసిసి ఉపాధ్యక్షులు పార.సీతయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, కౌన్సిలర్లు గంధం. యాదగిరి, షాబుద్దీన్, సూర్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి,షేక్ బాగ్దాద్, కంపాటి శీను, పిడతల.శ్రీను, సైది బాబు, ప్రవీణ్,ముస్తఫా, యాకుబ్,జానీ,అలీ భాయ్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.
Rajiv Gandhi’s ambitions achieved