Former Sarpanch Gadde Rama Rao death anniversary: గ్రామ అభివృద్ధిలో రామారావు సేవలు మరువలేనివి.. ఎంపీపీ
అనంతగిరి మండలపరిధిలోనివాయలసీంగారం మాజీ సర్పంచ్ గద్దె రామారావు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనియని అనంతగిరి మండల ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రజా దీవెన, కోదాడ: అనంతగిరి(Anantgiri)మండలపరిధిలోని వాయలసీంగారం మాజీ సర్పంచ్ గద్దె రామారావు(Gadde Rama Rao)గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనియని అనంతగిరి మండల ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు(MPP Chundur Venkateshwarlu) అన్నారు. శుక్రవారం గ్రామంలో రామారావు తొమ్మిదవ వర్ధంతిని విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొని రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ నుండి సింగవరం గ్రామానికి రోడ్డు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ బాధలను తీర్చేందుకు కోదాడ(Kodada) నుండి సింగారం గ్రామం వరకు రోడ్డు బ్రిడ్జి నిర్మించి ప్రజలకు రాకపోకలకు ఎంతో కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.
అలాగే గ్రామంలో హరిజనులకు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఇండ్లు కాలనీలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అలాగే గ్రామంలో రామాలయాన్ని నిర్మించి దేవునిపై ఉన్న భక్తి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వర్లు ,(Kollu Venkateshwar)గ్రామం మాజీ సర్పంచ్ వెంపటి వెంకటేశ్వర్లు ,మిల్లు వెంకటయ్య, చల్లపల్లి సొసైటీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లు ,కొల్లు సుబ్బారావు, నందిగామ శ్రీనివాస్, గుండ్లపల్లి వెంకయ్య, గద్దె చిన్న రామారావు కుటుంబ సభ్యులు గద్దె రఘు ,అల్లు అరుణ, పోపూరి కరుణ, గద్ధె రమా ,గద్దె సరళి, శ్రీ లక్ష్మీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Rama Rao’s development unforgettable