Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RBI Reporate : బిగ్ బ్రేకింగ్, రిజర్వుబ్యాంకుఆఫ్ఇండియా తీపికబురు, రెపోరేటు 5.5శాతం యథాతథంతో వడ్డీరేట్లపై కీలకనిర్ణయం

 

RBI Reporate: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని పేద, సా మాన్య ప్రజలకు మరో సారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి క బురు అందించింది. వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడం ద్వా రా రెపోరేటు యథాతథంగా ఉంచుతూ ప్రజలకు గుడ్ న్యూస్ అం దిం చింది. దీంతో ఇకపై కూడా రెపో రేటు ( repo rate) 5.5 శాతం యథాతథం ఉం డనుంది.

ఇదిలా ఉండగా ఆర్బీఐ రేపో రేటులను స్థిరంగా ఉంచండం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ క్రమంలో తాజా ఆర్బీఐ ( Rbi ) ప్రకటన తో ప్రజలందరి నెలసరి వాయిదా చెల్లింపులలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టమవుతోంది.

*ఆర్థిక వ్యవస్థ బలపడే దిశగా ఆర్బిఐ…* దేశ ఆర్థిక వ్యవస్థను బ లపరిచే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల అత ర్జాతీయంతో పాటు మన దేశంలో నె లకొన్న కొన్ని పరిస్థితుల కార ణాలతో ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌ లో జరిగిన సమావేశంలో రేపో రేట్ల ను 0.25 శాతం చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా జూన్‌ నెలలో నిర్వ హించిన సమావేశంలో ఆర్బీఐ ఏ కంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గిం చింది. కాగా ఇలా వరుసగా మూడు కీలక సమావేశాల్లో ఆర్బీఐ రేపోరేటును 1 శాతం మేర త గ్గించింది. అ మెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ( usa president Tru mp) భారత్ పై విధించిన పన్నుల భారం, అంతర్జాతీయ పరిణా మాల నేపథ్యంలో ఆగస్టు నెలలో రేపో రేటు మాత్రం యథాతథం గా 5.5 శాతం వద్దే ఉంచు తూ నిర్ణ యం తీసుకుంది. అయితే అక్టోబర్ నెలలో కూడా రేపో రేటును యథాతథంగా ఉంచుతూ ప్రకటన విడుదలచేయడం శుభపరిణామం.