Reject Guntur Karam movie Do you know who the star hero is: గుంటూరు కారం సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలిసా
ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు
గుంటూరు కారం సినిమాని రిజెక్ట్
చేసిన స్టార్ హీరో ఎవరో తెలిసా
—ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ప్రజా దీవెన/ హైదరాబాద్: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వస్తున్న మూవీ “గుంటూరు కారం”. వీరిద్దరూ తొలిసారిగా “అత డు” సినిమా కోసం జతకట్టారు. ఆ తర్వాత “ఖలేజా” సినిమా తీశారు. ఆ రెండు సినిమాలు కూడా మహేష్ కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోయాయి. గుంటూరు కారం సినిమా కూడా మహేష్ బాబుతో పాటు ఫ్యాన్స్‌కు స్పెషల్‌గా నిలిచిపోతుందని అందరూ భావిస్తున్నారు.
“ఆ కుర్చీని మడతపెట్టి…” అంటూ మహేష్, శ్రీలీల ఒక సాంగ్‌లో వేసిన డ్యాన్స్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ పాటతోనే ఈ మూవీ ఎంత ఊర మాస్ మూవీగా రూపొందిందో అర్థమవుతుంది. అయితే ఇలాంటి సినిమాని ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు. అతడు మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా ఎన్టీఆర్ కోసమే ఈ సినిమా కథ రాసుకున్నాడు. ఆ కథతో సినిమా కూడా మొదలయ్యింది. కానీ ఎన్టీఆర్ కి ఆ తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం పోయిందట. అందుకే ఈ మూవీని రిజెక్ట్ చేసినట్లు ప్రస్తుతం సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అదే కథకు త్రివిక్రమ్ కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మహేష్ బాబుకి వినిపించాడట.
వినగానే కథ నచ్చడంతో మహేష్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా డట. ఆ విధంగా “గుంటూరు కారం” సినిమా కార్యరూపం దాల్చిం దని ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర లో నటించారు.
రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు అంటే జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తాడని సమాచారం. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలకు పైన ఉందని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మహేష్ ఖాతాలో మరొక సక్సెస్ వచ్చి చేరుతుంది. త్రివిక్రమ్ కూడా మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతుంది. ఏది ఏమైనా పటికి ఈనెల 12వ తేదీన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులకు ముందు కూర్చున్న గుంటూరు కారం అందరూ అనుకుంటున్నాట్టే సక్సెస్ కావాలని ప్రేక్షకు అభిమానులు కోరుకుంటున్నారు.