Republicday : అమరవీరుల పోరాటం అజరామరం
--ప్రపంచంలోనే భారత్ గొప్ప ప్రజాస్వామిక దేశం --ఆర్ధిక పురోగతి సాధన లక్ష్యంగా ప్రభుత్వ పథకాల అమలు --పేదలందరికీ ఉచితంగా అందుబాటులో కార్పోరేట్ వైద్యసేవలు --75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
అమరవీరుల పోరాటం అజరామరం
–ప్రపంచంలోనే భారత్ గొప్ప ప్రజాస్వామిక దేశం
–ఆర్ధిక పురోగతి సాధన లక్ష్యంగా ప్రభుత్వ పథకాల అమలు
–పేదలందరికీ ఉచితంగా అందుబాటులో కార్పోరేట్ వైద్యసేవలు
–75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర్య దినోత్సవానికి సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్ధినీ విద్యార్ధులకు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ రోజు మనందరికి పండుగ రోజoటూ వ్యాఖ్యనించారు. ప్రపంచం లోనే గొప్ప సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేం దుకు భారతరత్న డా.బి. ఆర్. అంబేడ్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నామని గుర్తు చేశారు.
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భం గా జోహార్లు అర్పిoచారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. కలెక్టర్ ప్రసంగం ఇలా కొనసాగింది.
*మహాలక్ష్మి పథకం:* నూతన ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణ ఆడబిడ్డలను మహా లక్ష్ములను చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం. ఆర్ధిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్ళే వారికి, విద్యార్ధులకు, మధ్య తరగతి మహిళలకు, ట్రాన్స్ జండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పై పెచ్చు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 39 లక్షల 77 వేల 469 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.
*రాజీవ్ ఆరోగ్యశ్రీ:* పేదలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల రూపాయల వరకు పెంచటం జరిగింది. పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చే ఈ పథకానికి డిసెంబర్, 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపిక చేసిన ఆసుపత్రులలో తక్షణమే వైద్య సేవలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో గడచిన ఏడాదికాలంలో 32 వేల 325 మందికి శస్త్ర చికిత్సలు అందించగా ఇందుకుగాను రూ. 63 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
*ప్రజాపాలన:* ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందరమ్మ ఇల్లు మరియు చేయుత పథకాల అమలు కొరకు 5 లక్షల 27 వేల 492 దరఖాస్తులను స్వీకరించి ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగింది.
*వ్యవసాయ శాఖ:* జిల్లాలో రైతులకు పంట పెట్టుబడి సహాయం క్రింద 2023-24 యాసంగి సీజన్ లో 3 లక్షల 12 వేల 688 మంది రైతులకు రూ. 172 కోట్ల 41 లక్షల పంటపెట్టుబడిగా పంపిణీ చేయనైనది.
*సాగునీటి పారుదల శాఖ:* జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా ఒక లక్షా 46 వేల ఎకరాలకు, AMR SLBC ప్రాజెక్ట్ హెచ్ ఎల్ సి మరియు ఎల్ ఎల్ సి కాలువల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాము.ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి.ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను రక్షించడం కొరకు చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నవి. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి అయిన పిదప 200 గ్రామాలకు త్రాగు నీరు 14 మండలాలకు 3 లక్షల 61 వేల ఎకరాలకు సాగునీరు కల్పించబడుతుంది.
వైద్య మరియు ఆరోగ్య శాఖ: జిల్లా కేంద్రంలో రూ. 275 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు భవన నిర్మాణం మంజూరు అయింది మరియు పనులు పురోగతిలో ఉన్నవి.
23 కోట్ల 75 లక్షల రూపాయలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నల్లగొండ నందు 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరై పనులు మొదలు కానున్నవి. నక్రేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరణకు 32 కోట్ల రూపాయలు మంజూరై పను లు జరుగుచున్నవి. 100 పడకల ఏరియా ఆసుపత్రి మిర్యాలగూడ ను 200 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణకై 14 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాబడి పనులు జరుగుచున్నవి. 30 పడకల సి.హెచ్.సి. హాలియ ఏర్పాటుకై 5 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి.
ఆసరా పించన్ల పథకంలో వృద్దాప్య, వితంతు, కల్లుగీత, బీడీ, ఒంటరి మహిళలు మరియు చేనేత కార్మికులకు జిల్లాలో 2 లక్షల 10 వేల 611 మంది లబ్దిదారులకు 53 కోట్ల 73 లక్షల 43 వేల రూపాయలు పించన్లు ప్రతినెల పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడే NAC స్కిల్ సెంటర్ ద్వారా 2 వేల మంది నిరుద్యోగ యువతీ యువతకు ఉపాధి కల్పించుటకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగింది.
జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధికై నిర్మాణాత్మక రీతిలో సహకారం సూచనలు అందజేయుచున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన మండ లి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గౌరవ రోడ్లు & భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు అందరికీ ఈ సంధర్భంగా నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్ నల్లగొండ, వివిధ శాఖల జిల్లా ఉద్యోగులకు, బ్యాంకర్లకు, స్వచ్చంద సేవా సంస్థలకు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.