Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Retired Employees: విశ్రాంత ఉద్యోగులు ఒంటరిగా గడప వద్దు. సామినేని ప్రమీల

విశ్రాంత ఉద్యోగులు ఇంటి వద్ద ఉండి ఒంటరిగా గడప వద్దని సంఘ కార్యాలయంలో సభ్యులందరితో ఆనందంగా ఆట,పాటలతో గడపాలని ,కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని. ప్రమీల, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్యఅన్నారు.

ప్రజాదీవెన ,కోదాడ: విశ్రాంత ఉద్యోగులు ఇంటి వద్ద ఉండి ఒంటరిగా గడప వద్దని సంఘ కార్యాలయంలో సభ్యులందరితో ఆనందంగా ఆట,పాటలతో గడపాలని ,కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని(Municipal Chair Person Samineni). ప్రమీల, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల.సీతారామయ్యఅన్నారు.గురువారం పట్టణంలోని  సంఘ భవనంలో కోదాడ(Kodada) యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి. శ్రీనివాసరావు అధ్యక్షతన మే నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను  సామూహికంగా నిర్వహించారు. ముందుగా అందరితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఒంటరిగా బాధపడుతూ దిగాలుగా ఉంటే అనేక వ్యాధులు చుట్టుముట్టి వృద్ధాప్యంలో వేధిస్తాయని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంఘ కార్యాలయానికి వచ్చి ఇక్కడ జరిగే సంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటపాటలల్లో పాల్గొనడం వలన బాధలన్నీ మరిచిపోయి తోటి వారితో సంతోషంగా ఉంటే వ్యాధులు(Diseases)దరి చేరకుండా ఆయుష్షు మరింతపెరుగుతుందన్నారు.అనంతరం చైర్ పర్సన్ సామినేని. ప్రమీలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ అధ్యక్షులు వేనేపల్లి(Venepally). శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీ నరసయ్య,బొల్లు రాంబాబు, వెంకటేశ్వరరావు,పొట్ట. జగన్మోహన్ రావు,గడ్డం. లక్ష్మీనరసయ్య, విద్యాసాగర్,అమృతా రెడ్డి, ఖలీల్ అహ్మద్, భ్రమరాంబ, శోభ తదితరులు పాల్గొన్నారు.

Retired employees do not alone