Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 4:33 pm Posted by : praja deveena

Revenue inspector caught in an ACB trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో నాంప ల్లి ఆర్‌ఐ గోపరాజు, రెడ్‌హ్యాం డె డ్‌గా పట్టుకున్న ఏసీబీ

Revenue inspector caught in an ACB trap : ప్రజా దీ వెన, నాంపల్లి :నల్లగొండ జిల్లా నాంపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం లో పనిచేస్తు న్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) రాళ్లబండి గోప రాజు ఏసీబీ వల లో చిక్కారు. వ్యవసాయ భూమి పట్టా చే యించేందుకు లంచం డి మాండ్‌ చేసిన ఆరో పణలపై సో మవారం నాంపల్లి చౌరస్తాలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఆవరణలో నగ దు తీసుకుంటుండగా ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. నల్ల గొండ ఏసీబీ డీఎస్పీ ఎం. జగదీశ్‌ చందర్‌ తెలిపిన వివ రాల ప్రకా రం నాంపల్లి మండలానికి చెంది న ఓ రైతు తన వ్య వసాయ భూ మికి పట్టా చేయించుకునేందుకు ఆర్‌ఐ గోపరాజును సంప్రదించా డు. ఈ పనికి రూ.20 వేలు లం చంగా డిమాండ్‌ చేసినట్లు ఏసీ బీకి ఫిర్యాదు అందింది. దీంతో రై తు రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఏసీబీ సూచనల మేరకు రైతు లంచం మొత్తాన్ని అందించేందు కు సిద్ధమయ్యాడు. ఆర్‌ఐ సూచ న మేరకు ఆయన పర్సనల్‌ అసి స్టెంట్‌ యాదగిరి ద్వారా రూ.15 వేల నగదును తీసు కుం టుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇ ద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఉ ద్యోగి తన విధులను నిష్ప క్షపాతంగా నిర్వహించాల్సి ఉండ గా, అక్రమ లాభం పొందేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీ బీ అధికారులు పేర్కొన్నారు. నిం దితులపై కేసు నమోదు చేసి అరె స్టు చేసిన అనంతరం నాంపల్లి లోని ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి కోర్టు లో హాజరుపరచనున్నట్లు తెలి పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

  లంచం అడిగితే 1064కు ఫిర్యాదు

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ జగదీశ్‌ చందర్‌ సూచించారు. ఏసీబీ వాట్సాప్‌ నంబర్‌ 9440 446106 ద్వారా కూడా ఫిర్యా దు చేయవచ్చని తెలి పారు. ఫి ర్యాదుదారుల వివరాలను గో ప్యంగా ఉంచుతా మ ని, లంచం డిమాండ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.