Lift irrigation: 10న లిఫ్ట్ ఇరిగేషన్ పై సమీక్ష సమావేశం
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 35 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, కోదాడ నియోజకవర్గంలోని 19 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సమర్థవం తమైన నిర్వహణ కోసం ఉన్నతా ధికారులతో ఈ నెల 10వ తేదీన సమీక్ష సమావేశం తలపెట్టారు.
కోదాడ లో అధికారులతో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సమీక్ష
ప్రజా దీవెన, హుజూర్ నగర్: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 35 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు(Lift Irrigation Schemes), కోదాడ నియోజకవర్గంలోని 19 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సమర్థవం తమైన నిర్వహణ కోసం ఉన్నతా ధికారులతో ఈ నెల 10వ తేదీన సమీక్ష సమావేశం తలపెట్టారు. ఈనెల 10 మధ్యాహ్నం 2 గంటల కు కోదాడ(Kodada) పట్టణంలోని అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నాగార్జున సాగర్ ఎడమ కాలువపై, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కృష్ణా నదిపై, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మూసి నదిపై, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పాలేరు వాగుపై(Paleru river)నిర్మాణం చేసి ఉన్నాయని, ఈ స్కీమ్స్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttamkumar Reddy)ఎంపీగా ఉన్న సమయంలో నిర్మాణం చేపట్టినవేనని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ తెలియజే స్తుంది.
మరికొన్ని లిఫ్ట్ లను ఇటీ వల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా మంజూరి చేయించడం జరిగింది. ఇంకొన్ని లిఫ్ట్ స్కీమ్ లు ఇప్పుడు రూపొందిచబడుతు న్నాయని,ఈ క్రమంలో పాతవి గాని, కొత్తవి గాని, నిర్మాణంలో ఉన్నవి గాని, ఇప్పుడు డిజైన్ చేయ బడుతున్నవి గాని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి స్థాయి సామర్ధ్యంతో నడవాలనే సంకల్పంతో రైతులతో చర్చించి, వారి సూచనలు తీసుకొ నుట కొరకు జూన్ 10న మద్యా హ్నం 2.00 గంటలకు కోదాడ గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో(Guduguntla Appiah Function Hall) సమీక్షా సమావేశం నిర్వహిం చబడుచున్నదని, గతంలో ఈ లిఫ్ట్ ల మెయింట్ నెన్స్ కోసం టెక్నికల్ స్టాఫ్ ఎవ్వరూ ఉండకపోయేవారు.
రైతుల కమిటీకి మద్దతుగా ఇరిగేష న్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి లిఫ్ట్ కి లిఫ్ట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ను కాంట్రాక్ట్ పద్దతిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని లిఫ్టుల మర మ్మతులు చేయిస్తున్నారు.జూన్ 10న మధ్యాహ్నం 2 గంటలకు గుడుగుంట్ల ఈ సమావేశానికి ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి 5 నుంచి 10 మంది లబ్దిపొందిన రైతులు, ప్రజా ప్రతినిధులు రావాలని ఆహ్వా నిస్తున్నారు. సలహాలు, సూచన లను ఇవ్వాలని కోరుకుంటు న్నా ము. ఈ సమీక్షా సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తు న్నామని హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ(Huzurnagar Congress Party)ఓ ప్రకటనలో తెలిపింది.
Review on lift irrigation