Rising flood of river Krishna కృష్ణానదికి పెరుగుతోన్న వరద
--జూరాల 2 గేట్లు ఎత్తి శ్రీశైలం కు నీటి విడుదల
కృష్ణానదికి పెరుగుతోన్న వరద
–జూరాల 2 గేట్లు ఎత్తి శ్రీశైలం కు నీటి విడుదల
ప్రజా దీవెన/నాగర్ కర్నూల్: కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలు తాయి… నాటి పాట లోని అర్ధాలకు అద్దం పట్టే రోజులు ఈ ఏడాదికి దగ్గర పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నది (krishna river) కి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోన్న క్రమంలో ఈ ఆoశానికి ఎగువ కర్ణాటక (karnataka) మహారాష్ట్ర(maharastra) ల తో పాటు తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వరద ప్రవాహం(water flow)క్రమంగా పెరుగుతుంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాంకు 1,25,000 క్యూసేక్కుల భారీ వరద నమోదు కాగా ఇది గురువారం11 గంటల వరకు 1,50,000 క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు(officers) సూచించారు. దిగువన ఉన్న అలమట్టి,జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపూర్ డ్యాం(narayana Puram) జారీ చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో గురువారం జూరాల ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం కు 8 వేల250 క్యూసెక్కులు,విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 22 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజీ (sunkesula barej) కు1250 క్యూసెక్కుల స్వల్ప వరద కొనసాగుతుంది.