Road accident crime : నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం
-సంఘటన స్థలంలోనే ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం --ఒకే కుటుంభానికి చెందిన వారు కావటంతో హృదయ విదారకo --దైవదర్శనానికి వెళ్లి వస్తుంటే మిర్యాలగూడ వద్ద సంఘటన
నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం
–సంఘటన స్థలంలోనే ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
–ఒకే కుటుంభానికి చెందినవారు కావటంతో హృదయ విదారకo
–దైవదర్శనానికి వెళ్లి వస్తుంటే మిర్యాలగూడ వద్ద సంఘటన
ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Fatal road accident in Nalgonda district) సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన వారి కారు ప్రమాదానికి గురి కావడంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణమానస కాలనీ సమీపంలో గల అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై ఆదివారం రాత్రి ( Sunday night on Addanki-Narket Palli road) వీరందరూ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
ఈ నెల 26వ తేదీన కారులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో గల మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లిన వీరందరూ ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం( This accident occurred when all those who had gone for divine darshan were returning home on Sunday night) జరిగినట్లు తెలుస్తోంది. అదుపుతప్పి బోల్తా కొట్టిన కారును అటువైపుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది.కు టుంబంతో ఆనందంగా దైవదర్శనం పూర్తి చేసుకొని ఇంటికి తిరుగు ముఖమైన వారి కి అకస్మాత్తుగా ఊహించని ఈ ప్రమాదం ఎదురైంది.
ఒకే కుటుంబానికీ చెందినవారు కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతులంత మిర్యాలగూడ పట్టణ సమీపంలోని నందిపాడు గ్రామానికి చెందిన జ్యోతి (30), మహేష్ (35), మచ్చేందర్ (38), ఇషిక (8), లియాన్స్(2)లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలంలోనే మృతి చెందడంతో సంఘటనా స్థలంలో దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి.
మరణించిన మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ మేరకు స మాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు సంఘట నాస్థలా నికి చేరుకుని ప్రమాదానికి జరిగిన కారణాలు పరిశీలించారు. కారు ప్రమాదంలో అందులోని వారంతా మృతి చెందగా మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మిర్యాలగూడ కు మంత్రి కోమటిరెడ్డి….మిర్యాలగూడ రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి ( Minister Komatireddy Venkat Reddy was shoc ked at the accident) వ్యక్తం చేశారు. మరికాసేపట్లో మిర్యా లగూడకు బయలుదేరి మృతుల కుటుంబాల ను పరామర్శిం చను న్నారు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి...మిర్యాలగూడలో జరిగిన ఘోర రోడ్ ప్రమాదం ఘటన పై మాజీ మంత్రి, సూర్యాపేట శాసనస భ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమా దం లో ఐదు గురు మృతి చెందడం విషాదకారమన్నారు.మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.