Rtv legal notice : ఆర్టీ వీ పై పరువు నష్టం దావా..!
--యూరో ఎక్సిమ్ బ్యాంకు రూ. 100 కోట్ల పరువునష్టంతో నోటీసు
ఆర్టీ వీ పై పరువు నష్టం దావా..!
–యూరో ఎక్సిమ్ బ్యాంకు రూ. 100 కోట్ల పరువునష్టంతో నోటీసు
ప్రజా దీవెన, హైదరాబాద్: ఆధారాలు లేకుండా తన క్లయింటు పై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను ఆర్ టీవీ ఎడిటర్ అం డ్ పబ్లిషర్ వెలిచేటి రవిప్రకాష్ ( ravi Prakash) కు లండన్ కు చెందిన యూరో ఎక్సి మ్ బ్యాంకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
పలు నిర్మాణ పనులను టెండర్లు లో భాగంగా దక్కించుకున్న తన క్లయింటు మేఘ ఇంజనీరింగ్ సంస్థ తరపున ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ ని తప్పుపడుతూ ఆర్ టీవీ ( rtv) రవిప్రకాష్ తానె స్వయంగా కధనాలు ప్రసారం చేసారు. అవి దొంగ బ్యాంకు గ్యా రంటీలు అంటూ తప్పుడు కధనాలు ప్రసారం చేసినందుకు గాను రవి ప్రకాష్ కు యూరో ఎక్సిమ్ బ్యాంకు ( uro exim Bank) తరపున లీగల్ ఏజెన్సీ నోటీ సులు జారీ చేసింది.
ఈ కధనాల వల్ల కంపెనీకి ఆర్ధికంగా ( financial) నష్టం వాటి ల్లిందని, పరువు ప్రతిష్టలు కూడా భంగ పడ్డాయని ఆ నోటీసులో ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థ యిర్యం దెబ్బ తింది అని ఆవేదన వ్యక్తం చేసింది. తమ బ్యాంకు లండన్ (London) కేంద్రంగా ప్రపం చవ్యాపితంగా కార్య క్రమాలు నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఇండియాలో పలు ఇన్ఫ్రా కం పెనీలకు బ్యాంకు గ్యారంటీలను చట్ట బద్ధంగా ఇస్తోందని పేర్కొంది.
Rtv legal notice