Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 1:23 pm Posted by : praja deveena

Rupa Reddy Murder in Kondamallepally : బిగ్ బ్రేకింగ్, కొండమల్లేపల్లిలో విషాదం, పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి దారుణ హత్య 

Rupa Reddy Murder in Kondamallepally : ప్రజా దీవె న, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజక వర్గంలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొండమల్లే పల్లిలోని జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి (45) అనే మహిళ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె స్థా నిక నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. రాత్రి ఇం ట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి గు ర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలు స్తోంది. హైదరాబాద్‌లో ఉన్న రూపారెడ్డి భర్త రాత్రి ఆమెకు ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన, ఇంట్లో అద్దె కు ఉంటున్న వారికి ఫోన్ చేసి చూడమని చెప్పారు.

అద్దెదారులు వెళ్లి పరిశీలించగా విషయం వెలుగులోకి వ చ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందిం చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘ టనా స్థలానికి చేరుకుని, తలుపులుతెరిచి పరిశీలించారు.

గుర్తుతెలియని దుండగులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భా విస్తున్నాం. హత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో ద ర్యాప్తు వేగవంతం చేశామని, ఈ ఘటనతో జేబీ కాలనీతో పాటు కొండ మల్లేపల్లి ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్య క్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.