sammakkasarakkajatara: సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ప్రారంభం
--వన దేవతలను దర్శించుకున్న మంత్రి దనసరి సీతక్క
సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ప్రారంభం
–వన దేవతలను దర్శించుకున్న మంత్రి దనసరి సీతక్క
sammakkasarakkajatara : ప్రజా దీవెన, మేడారం: తాడ్వా యి మండలంలోని మేడారంలో గురు వారం ప్రారంభమైన ఆసియా లోనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీసమ్మక్క సారలమ్మ మినీ మేడారం వనదేవ తలను రాష్ట్ర పంచా యితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శి శు సంక్షేమ శాఖ మంత్రి, డాక్టర్ దనసరి అన సూయ సీతక్క దర్శించు కున్నారు.
ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లిం చా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి నాలుగు రోజు ల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మం ది భక్తులు వచ్చే అవకాశం ఉండ డంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతర పరిసరాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపా రు.
మేడారంలో నిరంతర నాణ్య మైన వైద్య సేవలు వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ, అని వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందు బాటులో ఉంచుకోవాలని, అత్య వసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధం గా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సం ఘటన జరగకుండా పోలీస్ అధికారు లు అప్రమత్తంగా ఉండాలని జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారి శుద్ధ్య కార్మి కులచే నిరంతరం శుభ్రంచే యించాలని తెలిపారు.
భారీ సం ఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కిం గ్ స్థలాలలో వాహనాలు నిలిపే వి ధంగా చర్యలు తీసు కోవాలని, ని రంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్ర మత్తంగా ఉం డాలని మంత్రి సీత క్క అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపో తు న్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగ కుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని, దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరిం చారు.
జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యే కంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడ కుండా నిరంతరం నీటి ని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జా తరను పుర స్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తె లిపారు.
వనదేవతలను దర్శించుకుని సుర క్షితంగా ఎవరి ఇండ్లకు వారు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సీతక్క తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ అత్రం సుగు ణ, కాంగ్రెస్ పార్టీ ములుగుబ్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.