సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శానంపూడి సైదిరెడ్డి దంపతులు
శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాలలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ప్రజాదీవేన నల్గొండ: శ్రీ రామనవమి పర్వదినం(srirama navami celebrations) సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాలలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి(sanampudi saidi reddy) దంపతులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో వీటి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి, రామగిరి రామాలయం, రైల్వే హెడ్ కోటర్స్ హనుమాన్ దేవాలయం, క్రాంతి నగర్ హనుమాన్ దేవాలయం, గొల్లగూడ రాములవారి దేవస్థానం, గందవారి గూడెం హనుమాన్ దేవాలయం, డీవీకే రోడ్ కనకదుర్గ కాలనీ హనుమాన్ దేవాలయం శ్రీ రాములవారి కళ్యాణంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, వార్డు కౌన్సిలర్లు, జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
sanampudi saidi reddy in srirama navami celebrations