Opinionక్రైంతెలంగాణహైదరాబాద్

Sangareddy RTC Conductor Attack : బిగ్ బ్రేకింగ్, సంగారెడ్డిలో హైడ్రా మా, లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో సత్కారం

Sangareddy RTC Conductor Attack : ప్రజా దీవెన, రాయ కోడ్: సాధార ణంగా బస్సులో టికెట్ లేకపోతే ఫై న్ వేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివ ర్స్ అయ్యింది. టికెట్ లేని ప్రయా ణి కుడిని పట్టుకున్న అధికారి, దాన్ని ‘అవకాశం’గా మార్చుకో వాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. చివరికి ప్రయాణికుల ఆగ్రహానికి గురై దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది.

హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను రాయ కోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ త నిఖీ కోసం ఆ పింది. చెకింగ్ చేస్తు న్న క్రమంలో ఒక ప్రయాణికుడి వద్ద టికె ట్ లేదని తేలింది. ఇక్కడి వరకు అంతా మామూలే.. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కేసు నమోదు చేయకుం డా ఉండాలంటే సదరు అధికారి ఆ ప్రయాణికుడి తో పాటు కండక్టరును కలిపి రూ. 20,000 లంచం డిమాండ్ చేసి న ట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తప్పును సరిదిద్దాల్సిన అధి కారి అందినకాడికి దండుకోవాలని చూడటంతో బస్సులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

తప్పు చేస్తే ఫైన్ వేయాలి కానీ, వేలల్లో లంచం అడుగుతారా అంటూ కండక్టర్ మరియు ప్రయాణికులు సదరు అధికారిపై విరుచుకుపడ్డా రు. మాట మాట పెరగడంతో సహనం కో ల్పోయిన కండక్టర్ మరియు కొందరు ప్రయాణికులు అధికా రిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఒకరు చెప్పుతో కొట్టడంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. నడిరోడ్డుపై జరిగి న ఈరభస తో ప్రయాణికులు కొద్ది సేపు ఆందోళనకు గురయ్యారు.

లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఆర్టీసీ ఉన్నతాధికా రులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. చట్టా న్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటారా అనేది వే చి చూడాలి. తప్పు చేసిన ప్రయాణికుడిని పట్టుకోవడం డ్యూటీ కానీ దాన్ని క్యాష్ చేసుకోవాలని చూడటం మాత్రం భారీ మూల్యమే చెల్లించుకునేలా చేసిందని చెప్పవ చ్చు.

Related Articles

Back to top button