Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 5:42 am Posted by : praja deveena

Sankranti festival trafficjam : నల్లగొండఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీతోపాటు ఎదురువారి ప్రాణాలనుకూడా కాపాడండి

 

Sankranti festival trafficjam:  ప్రజా దీవెన, నల్లగొండ: పండగ అ నంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదా రులు ట్రాఫిక్ నిబంధన లు పాటిస్తూ పోలీస్ శాఖకు సహక రించి తమతో పాటు ఇతరుల ప్రా ణాలను కూడా కాపాడాల ని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండగ ముగించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృ ష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఆదివారం ఆయన ఓ ప్రకటన విడు దల చేస్తూ నల్లగొండ జిల్లా పరిధిలో సంక్రాంతి పండగ ముగించుకుని ఆంధ్ర ప్రాం తం నుంచి హైదరాబాద్ దిశగా తిరుగు ప్రయాణాలు అధి కం గా సాగుతున్న నేపథ్యంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకా శం ఉందని, ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బందు లు కలగకుండా అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పో లీస్ శాఖ సమగ్రచర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జాతీయ రహదారులు, రాష్ట్ర రహ దారులు, ముఖ్య కూడ ళ్లలో 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బం దితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామ ని తెలిపారు.వాహన రద్దీని ఎప్ప టి కప్పుడు గమనించేందుకు డ్రోన్ల ద్వారా గాలిలో నుంచే నిరంతర ప ర్యవేక్షణ నిర్వహి స్తూ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వెం టనే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అధి కంగా ప్రయా ణించే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజా లు, ఫ్లై ఓ వర్లు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించిన ట్లు తెలిపారు.ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న సమ యాల్లో వా హనాల గమనాన్ని సజా వుగా కొనసాగించేందుకు అవసర మైతే మార్గమళ్లింపులు అమలు చే స్తామని స్పష్టం చేశారు. ప్రయాణికు ల భద్రత దృష్ట్యా అవసరమున్న చో ట్ల మెడికల్ క్యాంపులు, అంబులె న్సులు సిద్ధంగా ఉంచామని, అత్య వ సర పరిస్థితుల్లో వెంటనే వైద్య సే వలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అదే విధంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడప డం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్ వంటి వాటిపై క ఠిన నిఘా కొ నసాగుతుందని హె చ్చరించారు.వాహనదారులు త ప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సం బంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణ స మ యంలో అలసటగా అనిపిస్తే సురక్షి త ప్రాం తాల్లో విశ్రాంతి తీసుకోవాలని, నిరంతర డ్రైవింగ్‌కు దూరం గా ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు లేదా అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూ మ్ 100 ను సంప్రదించాలని తెలిపారు.