IndiaOpinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

SC ST Welfare Schemes Telangana : ఎస్సీ,ఎస్టీల ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలుకావాలి 

--రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య

–రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షె డ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

SC ST Welfare Schemes Telangana : ప్రజా దీవెన, న ల్లగొండ: షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి అభివృద్ధి కి ప్రభు త్వం ప్రవేశపెట్టి న పలు పథకాలు పకడ్బందీగా అమలు కా వాలని రాష్ట్ర షె డ్యూ ల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంక టయ్య అన్నారు.బుధవారం ఆ యన కమిషన్ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కా ర్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లాలోని ఎ స్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల సమ స్యలు, దాడుల కేసులు, ఉద్యో గాలలో ఎస్సీ ,ఎస్టీ రూల్ ఆఫ్ రి జర్వేషన్ అమలు, తదితర అం శాలపై అధికారులతో సమీక్షిం చారు.

వివిధ అంశాలపై సమీక్ష సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ ఎ స్ సి ల కై వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న స బ్ ప్లాన్ ని ధులు పక్కాగా వినియోగించాల ని,దారి మళ్లించ వద్దని, ఒకవేళ దారి మళ్ళి ఇస్తే కఠిన చర్యలు ఉంటాయ న్నారు .ఎస్సీ, ఎస్టీ ఆ వాసాలలో చేపట్టేందుకు మం జూరైన పనులు ఇతర పనులకు మళ్లించకూడదన్నారు.ఎక్కడైనా సబ్ ప్లాన్ నిధులు మిగిలిపోతే తిరిగి ఎస్సీ, ఎస్టీ కాలనీలలో రో డ్లు, ఇతర పనులు చేపట్టాలన్నా రు. ఉద్యోగాలు, ప్రమో షన్లలో ఎ స్సీ ,ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్ ఓఆర్ అమలు చేయాలని, ఈ వి షయంలో అన్యాయం జరిగితే క మిషన్ ఊరుకోదని హెచ్చరించా రు. ఎంపీ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్ డి ఎఫ్ నిధులను రిజర్వేషన్ ప్రకా రం కేటించాలన్నారు.

మిర్యాలగూడ డివిజన్లో శూన్య పహాడ్, గణేష్ పహాడ్ రోడ్డు వ్య వహారాన్ని సాధ్యమైనంత త్వ రగా పరిష్కరించాలని జిల్లా కలె క్టర్ తో కోరారు. జిల్లాలో ఎస్సీ, ఎ స్టీలపై దాడుల కు సంబంధించి కో ర్టు కేసులు జాప్యం లేకుండా పరి ష్కరిం చాలని, శిక్షల శాతాన్ని పెం చాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఎ క్కువ మంది ఎస్సీ ఎస్టీలే పనిచేస్తున్నం దున పారిశుధ్య కార్మికులకు త ప్పనిసరిగా ఇన్సూరెన్స్ అమలు చేయాల న్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉ ద్యోగుల నియామకంపై తక్ష ణమే విచారణ నిర్వహించి క మిషన్ కు నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. చండూ రు మండలం అంగడిపేటకు చెందిన ఎస్సీ మహిళ మేకల బు చ్చ మ్మ ఇంటి వివాదం కేసును విచారించి పరి ష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ దాడుల కేసుల్లో బాధితులకు అందిం చా ల్సిన కో టి 89 లక్షల రూపాయల పరిహారాన్ని సాధ్యమై నం త త్వరగా తె ప్పించేందుకు ప్రయత్నిస్తామని, అలాగే కు లాంతర వివాహాలు చే సుకున్న వారికి, బెస్ట్ అవైలబుల్ పా ఠశాలలకు నిధులు తెప్పించేం దుకు కృషి చేస్తామని తెలిపా రు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి తో నిర్వహించనున్న హై పవర్ కమిటీలో వీటన్నిటిపై సమీక్షించి నిధులు మంజూరు చేయమని కోరనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని గుడి తాం డ పునరావాస కేం ద్రానికి సంబంధించి 130 మంది కి పరి హారం రాని విషయంలో స మగ్ర విచారణ నిర్వహించి వారి కి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు.

నల్గొండ జిల్లా కేంద్రం బైపాస్ వ ద్ద అంబేద్కర్, బాబు జగ్జీవ న్ రామ్ విగ్రహాలను రోడ్డు నుండి తొ లగించకుండా కమిటీ వేసి విచార ణ నిర్వహించాలని నిర్ణయం తీ సుకోవాలన్నా రు. షెడ్యూల్డ్ కు లాలు,తెగల వారిపై జరిగిన దాడులు ,హ త్యలు, అత్యాచార కే సుల్లో ఉచితంగా న్యాయ సహా యం అందిస్తున్న అడ్వకేట్ దర్శ న్ కు గన్ మెన్ ను పునరుద్ధ రిం చాలని జిల్లా ఎస్పీతో కోరారు. ఎ స్సీ, ఎస్టీ ఉద్యోగాలలో రి జర్వేషన్ పాటించాలని, ప్రమోషన్లలో ఎ వరికి అన్యాయం జరగకుండా చూడాలని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ము ఖ్యమంత్రి వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇ చ్చారని, మరో వెయ్యి ఇండ్లు ఇస్తామని తెలియ జేశా రని వెల్లడించారు. రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల లకు నిధులు కేటాయించేందుకు రా ష్ట్ర ముఖ్యమంత్రిని కోరను న్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ స భ్యులు జిల్లా శంకర్ మాట్లాడు తూ జిల్లాలో ఎస్సీ ,ఎస్టీలపై దా డుల కేసుల పరిష్కారం, డ్రగ్స్ అ రికట్టడంలో పోలీసు, రెవెన్యూ శాఖలు చేస్తున్న కృషిని ప్రశంసిం చారు. నల్గొండ బైపాస్ లో ఉన్న మహాత్ము ల విగ్రహాలను అక్కడి నుండి కదిలించవద్ద ని,ఎస్సీ, ఎ స్టీల పై దాడుల కేసులకు సంబం ధించిన అడ్వకేట్ దర్శన్ కు గన్మె న్ రక్షణ కల్పించాలని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యం అవు ట్సోర్సింగ్ ఉద్యోగాల నియామ కానికి సంబంధిం చిన అంశంపై వి చారణ నిర్వహించి నివేదిక సమ ర్పించా లని, ఎస్సీ, ఎస్టీలకు ప్ర త్యేకంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వా లని, ఎస్సీ, ఎస్టీ కేసులో తక్షణ మే ఎఫ్ఐఆర్ నమోదు అ య్యే లా చేయాలని, శూన్య పహాడ్ , గణేష్ పహాడ్ రోడ్డుకు సంబం ధించిన సమస్యను సాధ్యమై నం త త్వరగా పరి ష్కరించాలని, కు లాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహక మొత్తాన్ని ఇ ప్పించడంలో చొరవ తీసుకోవాల ని కోరారు.

మరో సభ్యులు రాంబాబు నా యక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎ స్టీ లకు న్యాయం చేకూర్చేందుకు రా ష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్రం లోని అన్ని జిల్లాలను పర్యటిస్తు న్నదని, ఎస్సీ, ఎస్టీ ల సంక్షేమం, అభివృద్ధికి ఇతర రాష్ట్రాలలో సై తం ఎస్సీ, ఎస్టీలపై అధ్యయనం చేయడం జరిగిందని, నల్గొండ జి ల్లా లో గతంలో కంటే కేసుల ప రి ష్కారం ఎంతో మెరుగ్గా ఉంద ని, ఎస్సీ, ఎస్టీల భూముల విషయం లో అగ్రవర్ణాల ఆధిప త్యానికి అరి కట్టే చర్యలు తీసుకోవాలని, గుడి తాండా ఆర్ అండ్ ఆర్ లో తం డ్రులకు నష్టపరిహారం రాగా, కొ డుకుల కు ప్యాకేజీ రాలేదని, ఈ విషయంపై ప్రత్యేకంగా విచారణ నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఈ సమావేశం ప్రారంభమైన వెం టనే జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి పై దాడులకు సంబంధించి చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేస్తున్నామని, ఇం దులో భాగంగా జిల్లా విజిలెన్స్ మాని ట రింగ్ కమిటీని ఏర్పాటు చేసి రెండుసార్లు సమావేశాలు ని ర్వహించామని,రెవిన్యూ ,పోలీస్ తరఫున ఎలాంటి ఇబ్బం ది లేకుండా ఎస్సీ, ఎస్టీల కేసులను ఎప్పటికప్పుడు పరిష్క రిస్తున్నా మని, ప్రతి నెల క్రమం తప్పకుం డా పౌర హక్కుల దినోత్సవం ని ర్వహిస్తున్నామని, ఎస్సీ ,ఎస్టీల ప్రజల హక్కు లు కాపాడడంలో వారి ఇబ్బందులను తీర్చేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నా మ ని, డివిజన్ ,మండల స్థాయిల లో కూడా అధికారులు ఎస్సీ, ఎ స్టీ ల అభివృద్ధికి కృషి చేస్తు న్నారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న పథకాలు అర్హు లైన లబ్ధి దారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మా ట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృ ద్ధి, సంక్షేమంలో భాగంగా నల్గొం డ జిల్లాలో జిల్లా విజిలెన్స్ మా ని టరింగ్ కమిటీ ఏర్పాటుతో పా టు నిరం తర సమీక్షలు, దాడుల లో బాధితులకు నష్టపరిహారం ఇ ప్పించడం, క్రమం తప్పకుండా పౌర హక్కుల దినం నిర్వ హించడం చేస్తున్నామని, ప్రతి సంవత్స రం జిల్లాలో 90 నుండి 100 వ రకు ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు నమో దు అవుతున్నట్లు వెల్ల డించారు. ప్రస్తుతం జిల్లాలో 54 కేసు లు విచారణలో ఉండగా, ఇ ప్పటివరకు 6 కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షణ కూడా విధించడం జరిగిందని వెల్లడించారు.

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ క మిటీ సభ్యులు సుంకు ధన లక్ష్మి, బెజ్జం సైదులు, మరో సభ్యులు అనిత, భీమనపల్లి సైదులు, భా స్కర్ తదితరులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల కింద సబ్ ప్లాన్ కిం ద లోన్లు ఇప్పించాలని, బ్యాక్లాగ్ పోస్టుల ను భర్తీ చేయాలని, ఎ స్సీ ,ఎస్టీ ,బీసీ సంక్షేమ శాఖల అ వు ట్సోర్సింగ్ ఎంప్లాయిస్ లో ఏ జెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగులను నియమించాలని, ఎస్సీలు కేసులు పెట్టినప్పు డు త్వరిత గతిన పరిష్కరించాలని, ఆర్ ఓ ఆర్ తప్పనిస రిగా పాటిం చేలా చూడాలని ,ఎస్సీ ,ఎస్టీ వాడల్లో టాయి లెట్స్ నిర్మించాల ని, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించా లని, ఎస్సి వాడల్లో సిసి రోడ్లు, డ్రైన్లు వేయించాలని ,ఎస్సీ కా ల నీలలో సారా అరికట్టాలని, గ్రా మాలలో చట్టాలపై అవగాహన కల్పించాలని, అంగడిపేట మేకల బుచ్చమ్మ కేసును త్వరితగతిన పరిష్కరించాలని ,అలాగే కనగల్ కేసులను పరిష్కరించాలని కో రారు.

పలు సంఘాల ప్రతినిధులు మా ట్లాడుతూ ఎస్ సి,ఎస్ టి ల స మస్యలను త్వరితగతిన పరిష్క రించాలని కోరారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే. లక్ష్మీ నారాయణ, కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన పు కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశి కళ, డిటిడిఓ కమలాకర్, డి. ఎఫ్.ఓ రాజశేఖర్, డిఆర్ఓ దశ రథ్, ఆర్డీవోలు,డి ఎస్పీలు, పా ల్గొన్నారు. అంతకు ముందు జి ల్లాలో ఎస్సీ, ఎస్టీల సమీక్ష కోసం జిల్లా చేరుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకట య్య సభ్యులకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పుష్పగుచ్చలను అం దజేసి ఘన స్వాగతం పలికారు.

Related Articles

Back to top button