Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

See and embrace the development: అభివృద్ధిని చూసి ఆదరించండి

-- ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి

అభివృద్ధిని చూసి ఆదరించండి

— ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ:  నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు కోరుతున్నానని నల్లగొండ టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రారంభమైన పనులు పూర్తి కావాలంటే మళ్ళీ నల్లగొండలో గులాబీ జెండా ఎగరాలే, కెసిఆర్ ప్రభుత్వమే రావాలని ( If the started works are to be completed, the pink flag should be hoisted again in Nalgonda and the KCR government should come) గుర్తు చేశారు.

చైతన్యవంతులైన నల్లగొండ ప్రజలు నల్లగొండ అభివృద్ధిని చూసి తనను తప్పక మళ్ళీ గెలిపిస్తారని విశ్వాసం, నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నల్లగొండ పట్టణంలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. నల్లగొండలో నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ( Where is Komati Reddy Venkat Reddy who won four times in Nalgonda)  ప్రజలు ప్రశ్నించాలని, నాలుగేళ్లు ప్రజలకు ముఖం చాటేశారని దుయ్యబట్టారు.

ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి నిరంతరం ప్రజల మధ్య 24/7 అందుబాటులో ఉంటూ ( Ever since he won as MLA, he has been constantly available to the public 24/7) వారి సమస్యలు పరిష్కరిస్తున్నానని గుర్తు చేశారు. గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వెంకట్ రెడ్డి బత్తాయి మార్కెట్, మెడికల్ కాలేజ్, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానని మాయ మాటలు చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని వివరిoచారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో నా హయాం లోనే ప్రతి ఒక్కటి అవిష్క రించుకున్నామని తెలిపారు.

నేను నిరంతరం ప్రజలకు ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సేవనే నమ్ముకున్నానని, కానీ కోమటిరెడ్డి మాత్రం నోట్ల కట్టలతో నాయకుల ను కొనుక్కొని వారినే నమ్ముకున్నాడని (Komati Reddy bought the leaders with bundles of notes and believed in them) ఎద్దేవా చేశారు. కెసిఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పెన్షన్లు రూ. 5016 వరకు, దివ్యాంగుల పెన్షన్ రూ. 6016 వరకు, రైతు బంధు రూ. 12000 నుంచి రూ. 16 వేల వరకు విడుతల వారీగా పెంచుతారని, అర్హులైన మహిళలకు రూ. 3వేల భృతి అందిస్తారని, గ్యాస్ సిలిండర్ రూ. 400లకే అందిస్తారని, బిపిఎల్ కుటుంబాల అందరికీ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని తెలిపారు.

స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మోదుగు రాజ వర్ధన్ రెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, 16వ వార్డు ఇంచార్జ్ దాసరి రమేష్,15 వ వార్డు ఇంచార్జి దొడ్డి రమేష్, యుగంధర్ రెడ్డి, ఇస్రం రవి, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కట్టా హనుమంతు తదితరులు పాల్గొన్నారు.