Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:06 am Posted by : praja deveena

Senior Congress leader JeevanReddy : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమలుపు, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా 

Senior Congress leader JeevanReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాజకీయాల్లో అనూహ్యమలుపు తిరిగింది. కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగా ణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగిత్యా ల జిల్లాలో తనకు ఎదు రైన అవమానాలు, పార్టీ అంతర్గత వ్యవహారాల పట్ల పెరుగుతున్న అ సహనంతో ఉన్న ఈ రెం డు అంశాలు చివరికి ఆయనను ఈ కఠిన నిర్ణయానికి నెట్టా యి. పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయం లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

తెలంగాణ రాజకీయరంగంలో అకస్మాత్తుగా గాలిమారింది. ఒక నిర్ణ యం, ఒక రాజీనామా మొత్తం సమీకరణాలనే కది లించేలా మారింది.కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా కీలక పాత్ర పో షించిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తీసు కున్న ఆకస్మిక నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఊహించని ప్రకం పనలు రేపుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తి బయటకు వెళ్లడ మేనా లేక మరింత పెద్ద రాజకీయ కథకు ఇది ఆరంభమా అన్న సందేహాలు వేగంగా పెరుగుతున్నాయి.

జగిత్యాల రాజకీయాల్లో తనకు ఎదురైన అవమానాలు, పా ర్టీ అంతర్గత వ్యవహారాలపై పెరుగుతున్న అసంతృప్తి ఈ రెండు కారణాలు క లసి చివరకు ఆయనను ఈ కీలక నిర్ణ యానికి నెట్టాయి. పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వానికి దిగినా, ఆ యన మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీ సుకునే ప్రసక్తే లేద ని స్పష్టంచేశారు. ఇది సాధారణ అసహనం కాదని, లోతైన విభేదాలకు సంకేతమని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆయన తాజా వ్యాఖ్యలతో అసలు కథ మరింత ఆసక్తికరం గా మా రింది.తెలంగాణ కాంగ్రెస్ పని తీరు జాతీయ నా య కత్వ విధానాలకు విరుద్ధంగా ఉందని గట్టిగా విమ ర్శించా రు. ముఖ్యంగా రాహుల్ గాంధీ సూచనలకు విరుద్ధంగా రా ష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోం దని ఆయన ఆరోపించడం రాజకీ యంగా పెద్ద చర్చకు దారితీసింది.

పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనం దం నాకు లేకుండా పో యింది,” అంటూ ఆయన వ్యక్తం చేసిన వేద న వెనుక 20 నెలలుగా కొనసాగు తున్న అంతర్గత పోరాటం ఉందని చె ప్పారు. ఫిరాయింపుల విషయం లో పార్టీ తీసుకుంటున్న ని ర్ణయాలు, ముఖ్యంగా ఇటీవల జరిగిన కొన్ని చేరికలు తన కు తీవ్ర మనస్తాపం కలిగించాయని పేర్కొన్నారు.

“పదేళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారినే ఇప్పుడు పార్టీలో కి తీసుకుంటారా?” అంటూ ఆయన ప్ర శ్నించిన తీరు ఇది కేవలం వ్యక్తిగత బాధ కాదు, సిద్ధాంతపరమైన విభేదమని సూచిస్తోంది.ఇప్పుడు అం దరి దృష్టి ఒకే ప్రశ్నపై నిలిచింది జీ వన్ రెడ్డి తదుపరి అడుగు ఏమిట న్న ప్రశ్నలు వెల్లువెత్తు న్నాయి. ఆ యన మరో పార్టీలో చేరతారా లేక కొత్త రాజకీ య మార్గాన్ని ఎంచు కుంటారా, లేదా ఇది తెలంగాణ కాంగ్రె స్‌లో మరిన్ని మార్పులకు నాంది కాబోతుందా ఏదైనా కావ చ్చు కానీ ఒక విషయం మాత్రం స్ప ష్టం, ఈ రాజీనామా తె లంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.