Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

B tech College: సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలి

సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు బుధవారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

కిట్స్ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థినిలు కళాశాలకు పేరు తేవాలి
కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థుల వీడ్కోలు

ప్రజా దీవెన, కోదాడ: సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు బుధవారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కళాశాల నుండి బయటికి వెళ్లిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు,విద్యా అర్హత లు సంపాదించి కళాశాలకు పేరు తేవాలన్నారు. జూనియర్ విద్యార్థులకు విద్యాసంబంధ విషయాల్లో సహాయ సహకారాలు అందించాలన్నారు ఏ స్థాయిలో ఉన్న కళాశాలను అధ్యాపకులను మర్చిపోవద్దన్నారు.కళాశాల అకడమిక్ అడ్వైజర్ పోతుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం కల్పించే సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి కళాశాలప్రిన్సిపాల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు,ఏవో కృష్ణారావు హెచ్వోడీలు ఎజాజ్, అధ్యాపకులు శివాజీ రామకృష్ణ నాగన్న ప్రత్యూష శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Senior students guide junior students