Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:28 pm Posted by : praja deveena

sensational brutal double murder in suryapet : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో సంచలనం, మోతెలో జంటహత్యచేసి పాతిపెట్టినవైనం

 

sensational brutal double murder in suryapet:  ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతె మండ లం సమీపంలో భార్యాభర్తల దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మోతె మండలం బీక్యా తండాకు చెందిన హ లావత్ నాగు, బూబా దంపతులు రెండేళ్ల క్రితం పొట్టకూటి కోసం మోతెకు వచ్చి, కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్య వసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.

మధ్యరాత్రి నరరూప రాక్షసుల వికృతక్రీడ

అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు దంపతుల తలపై తీ వ్రంగా కొట్టి రక్తం ఓడేలా దారు ణంగా హత్య చేశారు. అ నంతరం ఆధారాలు లభించకుండా మృతదేహాలను సమీ పంలోనే పూడ్చిపెట్టారు. కాగా ఉదయాన్నే పొలానికి వెళ్తు న్న స్థానిక రైతులు పూడ్చిపెట్టిన ఆనవాళ్లను గుర్తించి వెం టనే పోలీసులకు స మాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ము నగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసు బలగాలు రంగం లోకి దిగాయి. ఎస్పీ నర సింహ స్వయంగా ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీ క్షించారు.

పూడ్చిపెట్టిన మృతదేహాలను బ యటకు తీయగా, వారు బీక్యా తండాకు చెందిన నాగు, బూబా లుగా తండా వాసు లు కన్నీరు మున్నీరవుతూ గుర్తించారు. మృ తదేహాలను పంచనామా అనం తరం పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి త రలించారు.హంతకులు ఎవరు? పా తకక్షలా? లేక ఆర్థిక లావాదేవీలా? అనే కోణంలో ఎస్పీ న రసింహ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.