Shamirpet Tahsildar surprise ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో షామీ ర్‌పేట్ తహసిల్దార్, ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో కూలిన ‘సుచరిత’ అవినీతి కోట

Shamirpet Tahsildar surprise ACB Trap : ప్రజా దీవె న, హైదరాబాద్:ఆమె ఒ క మండలానికి తహసీల్దార్. భూ ముల రిజిస్ట్రేషన్లను శాసించే జా యింట్ సబ్-రిజిస్ట్రార్. అ ధికారం చేతిలో ఉంది, అడిగిందే తడవుగా చేతులు మారే నోట్ల కట్టలు ఉన్నా యి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షామీ ర్‌పేట్ మండలంలో ఒక వెలుగు వెలిగిన తహసీల్దార్ తు మ్మకొమ్మ సుచరిత కథ ఇప్పుడు అక్రమ ఆస్తుల కేసుతో క్లై మాక్స్‌కు చేరింది.
ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) జరిపిన మెరుపు సోదాల్లో ఆమె సంపాదించిన ‘అక్రమ సామ్రా జ్యం’ బట్టబయలైంది. ఒక పని కో సం రూ. 30 లక్షలు డిమాండ్ చేసి, అందులో అడ్వాన్స్‌గా రూ. 2 లక్ష లు లంచం తీసుకుంటూ సుచరిత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ప్రస్తుతం ఆమె సస్పెన్షన్ లో, జ్యుడీ షి యల్ కస్టడీలో ఉన్నారు. అయితే, కథ అక్క డితో ముగిసిపోలేదు. ఈ లంచం కేసు వెనుక ఉన్న అసలు తిమింగలాన్ని బయటకు తీసేం దుకు ఏసీబీ అధికారులు ఆమె ఇల్లు, బంధువులు, బినామీల నివాసాలపై గాలింపు చర్యలు చేపట్టారు.
సరిగ్గా లంచం దొరికిన నెల రోజు లకు (జూన్ 25న) జరిగిన ఈ సో దాల్లో ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు గమ్మే రేంజ్‌లో ఆస్తులు బయటప డ్డాయి. డాక్యుమెంట్ల ప్రకారం వీటి విలువ రూ. 5,05,52,465 (రూ. 5.05 కోట్లు) కాగా, మార్కెట్ విలు వ ప్రకారం ఇవి వందల కోట్లలో ఉంటాయని అధికారుల అంచనా.
సుచరిత ‘కలెక్షన్స్’ లిస్ట్ ఇదీ..
కేవలం ప్రభుత్వ జీతంపైనే బతికే అధికారి ఇంట్లో దొరికిన సంపద చూస్తే ఎవరైనా ముక్కున వేలేసు కోవాల్సిందే. బం గారం, వజ్రాలకు సంబంధించి దాదాపు రూ. 1.20 కోట్ల వి లువైన స్వర్ణాభరణాలు, వజ్రాలతో పాటు లగ్జరీ కార్లు ఇంటి ముందు మెరుస్తున్న ఒక ఫోక్స్‌వ్యా గన్, మరొక హ్యుందా య్ క్రెటా కా ర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. నగదుతో పాటు బ్యాంక్ నిల్వల విషయానికొస్తే ఇంట్లో దొరి కిన రూ. 12 లక్షల లిక్విడ్ క్యాష్, బ్యాంకుల్లో ఉన్న రూ. 38 లక్షల బ్యాలెన్స్, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం డమర కుంట గ్రామంలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూ మితో పాటు హైదరాబాద్ లోని ప్రైమ్ లొకేషన్లలో 3 విలాస వంతమైన ఫ్లాట్లు, కీసర, ఖానా మెట్ గ్రామాల్లో మరికొన్ని ప్లాట్లు ఇలా ఎన్నో అధికారుల దాడుల్లో వెలుగు చూశాయి.
‘అవినీతి నిరోధక చట్టం, 1988’ లోని సెక్షన్లు 13(1)(b), 13(2) కింద సుచరితపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, లోతైన దర్యాప్తు చే స్తున్నారు. ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకా శం ఉందని అధికారులు భా విస్తున్నారు. ఇదిలా ఉండగా సుచరిత లాంటి అవినీతి అధి కా రులు మీ చుట్టూ ఉన్నా రా? ఎవ రైనా ప్రభుత్వ ఉద్యోగి మిమ్మల్ని లంచం అడుగు తున్నారా? భయ పడకండి.. ఒక్క అడుగు ముందుకు వే యండి ఫిర్యాదు చేయాలంటూ ఏసీబీ అధికారులు సూచి స్తున్నారు.






