OpinionPoliticsతెలంగాణహైదరాబాద్

Shiv Pratap Shukla Telangana Governor : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

Shiv Pratap Shukla Telangana Governor : ప్రజా దీవె న హైదరాబాద్: తెలంగా ణ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అ ధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర జల ఆశల మధ్య, గౌరవ ప్రదమైన వేడుకలో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతా ప్ శుక్లా బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత గౌరవంగా, భవి ష్యత్తుపై ఆశలు నింపే విధంగా జరగగా రాష్ట్ర హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శివ ప్రతాప్ శుక్లాతో గవర్నర్‌ గా ప్రమాణం చేయించారు.

ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై కొ త్త గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శా సనసభ స్పీకర్ గడ్డం ప్ర సా ద్ కుమార్, ఉప ముఖ్య మంత్రి భ ట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కో మటిరెడ్డి వెంకటరెడ్డి, మహమ్మద్ అజారు ద్దీన్, సీతక్క, దా మోదర్ రాజన ర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, ప్ర జా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని ఈ చారిత్రాత్మక వే డుకకు సాక్షులయ్యారు.


    విమానాశ్రయంలో ఘన స్వాగతం

అంతకు ముందు తెలంగాణ కు నూతన గవర్నర్‌గా నియ మితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్‌కు చేరుకున్న సమ యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్య మంత్రి రేవం త్ రెడ్డి స్వయంగా వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించారు.

ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ బి శివ ధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగా ణలో కొత్త గవర్నర్ పదవీ స్వీకారం రాష్ట్ర రాజకీయాలకు కొ త్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, అభివృద్ధి పథంలో మరిం త వేగం తీసుకురానుందని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

Back to top button