Siddipet fetal Road Accident : బిగ్ బ్రేకింగ్, సిద్దిపేట వద్ద ఘోర రో డ్డు ప్రమాదం, దంపతులు అక్కడి కక్కడే దుర్మరణం

Siddipet fetal Road Accident : ప్రజా దీవెన, సిద్దిపేట: సిద్దిపేట అ ర్బన్ మండలం మిట్టపల్లి వద్ద హై వేపై తీవ్ర వి షాదం చోటుచేసుకుం ది. ముందు వెళ్తున్న ఇసుక లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ భ యానక ప్రమాదంలో భద్రా ద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరుకు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పో యారు.
ఈ దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…సిద్దిపేట అర్బన్ మం డలం మిట్టపల్లి వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో రవి, సునీ త అనే దంపతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కాగా మృతుల కుమారుడు, కోడలు తీ వ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసు లు తెలిపారు.
మణుగూరుకు చెందిన రవి, సునీ త తమ కుటుంబంతో కలిసి కా రు లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిట్టపల్లి సమీపంలోకి రాగానే, వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఇసుక లారీని వె నుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్ర మాద తీవ్రతకు కారు ముందు భా గం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్ర మాదం జరిగిన వెంటనే స్థానికు లు, పోలీసులు అప్రమత్తమయ్యా రు. కారులో ఇరుక్కుపోయిన క్షత గా త్రులను రక్షించి, అత్యవసర చి కిత్స కోసం సమీప ఆసుపత్రికి తర లించారు. ప్రస్తుతం కుమారుడు, కోడలి పరిస్థితి అత్యంత విషమం గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రంగంలోకి పోలీస్ విభాగాలు ప్రమాదానికి గల ఖచ్చితమైన కార ణాలు అతివేగమా లేక డ్రైవర్ ని ద్రమత్తా అనేది ఇంకా తెలియరా లేదు. ఘటనపై కేసు నమోదు చేసి న పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.




