Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Singareni Dy CM bhatti vikramarkaa : సింగరేణి తెలంగాణకు తలమానికం

--సంస్ధ ను అభివృద్ధిలో కార్మికుల పాత్ర అభినందనీయం --సింగరేణి లాభాల పంటను కార్మికులకే పoచుతాం --సంస్ధ ఉద్యోగులు తగ్గడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం --సమస్త రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం --కొత్తగూడెం- రామవరం లో సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సింగరేణి తెలంగాణకు తలమానికం

–సంస్ధ ను అభివృద్ధిలో కార్మికుల పాత్ర అభినందనీయం
–సింగరేణి లాభాల పంటను కార్మికులకే పoచుతాం
–సంస్ధ ఉద్యోగులు తగ్గడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం
–సమస్త రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
–కొత్తగూడెం- రామవరం లో సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా దీవెన/ కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలం గాణ రాష్ట్రానికి తలమానికమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ ( Sin gareni coalarees) లిమిటెడ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తు న్న కార్మికులకు అభినం దనలు తెలియజేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లాభాల పంటను తప్పనిసరిగా కార్మికులకు పంచు తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధిని, కార్మికుల సంక్షేమాన్ని గత పది సంవ త్సరాలుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

సింగరేణి సంస్థలో ఉద్యోగులు తగ్గడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ద్వజమెత్తారు. సంక్షేమ రా జ్యంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగ అవకాశాలు జీవన పరిస్థితులు మెరుగవ్వడానికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని గుర్తు చే శారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించే బాధ్యతతో పనిచేస్తున్నదని తెలిపా రు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కొత్తగూడెం రామవరం లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( batti vikramarkaa mallu) ప్రసంగించారు. సింగరేణి సం స్థలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ద్వారా జరుగుతున్న శ్రమ దోపిడి నివా రించాలని, స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్న కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థలో ఇక ముందు శ్రమ దోపిడిని ఉపేక్షించమని, గత పది సంవత్సరాలు అధికా రంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం మిని మం వేజెస్ పై ఎలాంటి సమీక్ష చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రం గా నష్టపోయారని విమర్శించారు. సీఎల్పీ లీడర్ గా నేను అనేక మార్లు అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిన ఫలితంగా కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మినిమం వేజెస్ పై రివ్యూ మొదలుపెట్టామని, సిఎల్పీ లీడర్ గా ఆదిలాబాద్ (adilabad) నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా అనేక బొగ్గు బావులను సంద ర్శించినప్పుడు సింగరేణి సంస్థ లో పనిచేసే రెగ్యులర్ కార్మికుడు వా చ్ మెన్ రూ. 46 వేలు వేతనం పొందుతుండగా , ప్రైవేట్ ఏజెన్సీలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుడు 11,500 మాత్రమే వేతనం పొందు తున్నట్లు చెప్పారు.

మధ్య దళారుల దోపిడి వల్ల కార్మికులు నష్టపో తున్నారని ఆ సంద ర్భంగా గ్రహించానని, ఇక ముందు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణ యంలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కార్మికులకు నష్టం రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్కులర్ జారీ చేశామని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఏర్పడిన పది రోజుల్లోనే 441 మందికి సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.రెండు రోజుల క్రితం 464 ఉ ద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిం దని, కారుణ్య నియా మకాల కోసం అభ్యర్థుల వయసు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నామని అన్నారు. సింగరేణి పరి వాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల బ్లాకులను ఇతర సంస్థలకు వెళ్లకుండా సింగరేణికి ఆ బ్లాకులు వచ్చేలా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో గత సంవత్సరం 67 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల బొగ్గులు ఉత్పత్తి చేస్తున్నామని, రాబోయే కాలంలో సింగరేణి సంస్థ 90 నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు.

నైని, తాడిచర్ల కొయ్యగూడెం, రాంపురం, బొగ్గు గనుల బ్లాకులను ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి సంస్థ వదులుకోదని, అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్ ఎనర్జీ పై దృష్టిపెట్టాయని,అతి తక్కువ ధరకు విద్యుత్తు ను విని యోగదారులకు అందిస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలమాన పరిస్థితులను అంది పుచ్చుకోవ డానికి తెలంగాణ ప్రభు త్వం అంకితభావంతో పనిచేస్తున్నదన్నారు.

కొత్తగూడెంలో ప్రారంభించిన 10.5 సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం తో ఈ కార్యక్రమం ముగిసిపోలేదని, సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న అన్ని ప్రదేశాల్లో సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయా రు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు త యారీ పాలసీ లేకపోవడం వల్ల గత పది సంవత్సరాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరిగిందన్నారు.

పునరుత్పాదక విద్యుత్తు తయారీ పై కొత్త పాలసీ తయారీ చేయాల ని ఇప్పటి కే సంబంధిత అధికారులకు ఆదేశాలుఇచ్చామని, త్వరలో నూతన పాలసీని ప్రకటిస్తామని, సింగరేణి సంస్థలోని ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో ఉన్న జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్, ఓబిలపై సౌర వి ద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ కాలరీ స్ లిమిటెడ్ తయారు చేసిన ప్రణాళికల వల్ల సంస్థకు అదనపు ఆ దాయం రావడంతో పాటు ఆ సంస్థ కొత్త వరవడిలోకి దూసుకెళ్తున్న దని, భారీ, మధ్య తరహ సాగునీటి ప్రాజెక్టులు, మెయిన్ కెనాల్స్ బండ్స్ పై సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు ఈ ప్రభుత్వం తయా రు చేస్తుoదని వివరించారు.

ఎస్ ఆర్ ఎస్ పి నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్యేక ఫోకస్ పెట్టామని, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక విద్యుత్తు ఉత్పత్తి తయారు చేసే ప్లాంటును ప్రారంభించకుండా ఎక్కడి నుంచి కరెంటు తెచ్చి ఇచ్చారని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారిందని, మిగు లు కరెంటు గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ అంకుఠిత దీక్షతో పనిచేస్తున్నార న్నారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈనెల 27న చేవెళ్ల లో రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్తును అందించే పథ కాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు.

మార్చి నెలలో విని యోగదారులు 200 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని, త్వరలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే పథకాన్ని తిరిగి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులు ఉద్యోగులు 43 వేల మందికి రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభిస్తున్నామ ని, ఇందిరమ్మ రాజ్యంలో సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం పథకాన్ని గొప్ప కానుకగా అందిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లు సాంబశివరావు, రాందాస్ నాయక్, కోరం కనకయ్య, మట్ట రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, కలెక్టర్ ప్రియాంక అల, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎండీ బలరాం, భద్రాద్రి జెడ్పీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు, ఐ ఎన్ టి యు సి సింగరేణి కార్మిక నాయకులు జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.