టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సీతారెడ్డి
ప్రజా దీవెన/ రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతా రెడ్డి కి సముచిత స్థానం లభించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా నియమించారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. 24 మందితో ఏర్పాటు చేసిన కొత్త పాలక మండలిలో తెలంగాణా నుండి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి అవకాశం దక్కింది.
టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కడం పట్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఅర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు. ఇటీవల తిరుమల వేంకటేశ్వర స్వామినీ దర్శించుకున్న మరుసటి రోజే టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కడం విశేషం.