Six Martyred Heroes Revealed : బిగ్ బ్రేకింగ్, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన, ‘సిందూర్’ ఆరుగురి అమ రవీరుల తొలిసారిగా వెల్లడి

Six Martyred Heroes Revealed : ప్రజా దీవెన, న్యూ ఢి ల్లీ: సరిహద్దు ల్లో శత్రువుల గుండెల్లో వణుకుపుట్టించిన ఆ పరేషన్ దేశరక్షణ కోసం కొందరు యోధులు చేసిన క్షిపణి లాంటి పోరాటం అదే ‘ఆపరేషన్ సిందూర్’. ఈ ఆపరేషన్‌లో దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆ రుగురు అజేయ జవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. యావత్ దేశం గర్వించేలా, వా రి అమరత్వాన్ని డిజిటల్ శకంలో శాశ్వతం చేస్తూ నేషనల్ వార్ మెమోరియల్ జాతీయ యుద్ధ స్మారకం (national warmemorial) అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వీరుల పేర్లను చేర్చారు. ఈ సింధూర విప్లవంలో దేశరక్షణ కోసం ఐదుగు రు ఆర్మీవీరులు, ఒక ఎయిర్‌ఫోర్స్ యోధుడు వీరమరణం పొందా రు. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మా రక శిలపై వీరి పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించనున్నారు.
శత్రువుని చీల్చిచెండాడిన ఆరుగు రు అమరవీరుల పేర్లను కేంద్ర ప్ర భుత్వం వెల్లడించింది. సుబేదార్ మేజర్ పవన్ కు మార్ క్షేత్రస్థాయి లో సైన్యాన్ని ముందుండి నడిపించి, వ్యూ హాత్మక పోరాటంతో అమ రత్వానికి బాటలు వేశారు. అదే విధంగా హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ శత్రువుల వ్యూహా లను చిత్తు చేస్తూ, అచంచలమైన ధైర్యంతో పోరాడి ప్రాణా లర్పించారు.
ఇక లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ ముంచెత్తుతున్న ప్రమా దాన్ని ఎదుర్కొంటూ అద్వితీయ పరాక్రమాన్ని ప్రదర్శిం చా రు. ఆ తర్వాత రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ తన రైఫిల్ గురి తప్పకుండా శత్రు సంహా మీరం చేస్తూ మాతృభూమి ఒ డిలోకి చేరారు. అదే విధంగా అగ్ని వీర్ మురళీనాయక్ ‘ఆపరేషన్ సిందూర్’లో యువరక్తం ఉరక లేసే ఉత్సాహం తో, సరికొత్త చరిత్ర సృష్టిస్తూ వీరమరణం పొందిన యువ కిశోరం కాగా చివరకు సార్జెంట్ సురేంద్ర కుమార్ (ఎయిర్ ఫోర్స్) ఆకాశ మార్గంలో శత్రువుల గుండెల్లో గుబులు రేపి, వాయు సేన సత్తాచాటుతూ అమరుడయ్యారు.
దేశ భద్రత కోసం ‘ఆపరేషన్ సిందూర్’లో ఈ ఆరుగురు యోధులు చూపిన సాహసం రాబోయే తరాలకు స్ఫూర్తి దా యకం. డిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ సాక్షిగా వీరి త్యాగం చిరకాలం వెలుగుతూనే ఉంటుందని రక్షణ మంత్రి త్వ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.మృత్యువును సైతం చి రునవ్వుతో ఆహ్వానించిన ఈ ఆరుగురు ధీరు ల త్యాగానికి దేశం నమస్కరిస్తోంది. రాబోయే రోజుల్లో దేశ రాజధానిలో వీరి పేర్లు దేశ రక్షణకు సజీవ సాక్ష్యాలుగా నిలవనున్నాయ ని ప్రకటించింది.





