slbc tunnel telangana : ఎస్ఎల్ బిసి పనుల పునరుద్దరణకు ప్రణాళికలు,2028 జనవరి మాసాంతానికి పూర్తి
--ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై దృష్టి ద్వారా హెలీ బోర్న్ సర్వేకు శ్రీకారం --ఎస్ఎల్ బిసి పూర్తితో ఆంద్రప్రదేశ్ అనధికారికంగా వాడుకుంటు న్న నీటికి చెక్ --టన్నెల్ నిర్మాణంలో నిపుణునులు ఇంజినీర్లతో మూడు షిఫ్ట్ లలో ప నులు --భారీ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
slbc tunnel telangana: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎస్ఎ ల్ బిసిపనుల పునరుద్ధరణకై ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్త మ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మ కంగా ఈ ప్రా జె క్టును పూర్తి చేయాలని సంకల్పించి నట్లు ఆయన పేర్కొన్నారు. అందు లో భాగం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిం చి త్వరితగతిన పూర్తి చే సేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగా గురువారం రోజున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ ఎల్ బి సి పునరుద్ధరణ పనుల పు రోగతిపై బుధవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వ హించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ నెలకు 17 8 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యం గా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన ప్రక టించారు.మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని మిగిలిన తొమ్మి ది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వ డానికి గాను అత్యాధునిక సాంకేతి క పరిజ్ఞానాన్ని వినియోగించ బోతు న్నట్లు ఆయన తెలిపారు.
అందులో భాగంగా ప్రపంచం మొ త్తంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహిం చేందుకు నిర్ణయం తీసుకున్నామ న్నారు.నేషనల్ జియో ఫిజికల్ రీ సెర్చ్ ఇనిస్ట్యూట్(NGRI)ద్వారా ఈ సర్వే నిర్వహించ తలపెట్టినట్లు ఆ యన తెలిపారు.తద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ప్ర మాదాలను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసు కు నే వెసులుబాటు ఇంజినీర్లకు ఉంటుందన్నారు.
నీటిపారుదల సలహా దారుడిగా లె ఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ ని యామకం ఈ సొరంగ మార్గం పూ ర్తికి దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగ మార్గం తవ్వకాల సమ యంలో గా లి,వెలుతురు ఆవశ్యకతతో పాటు నీటిపారుదల రంగం లో యువ ఇం జినీర్లకు శిక్షణ ఇచ్చే ఆవశ్యకతను ఆయన వివరిం చారు.ఎటువంటి జాప్యం లేకుండా సత్వరమే సర్వే ఏర్పాట్లు చే యాలని ఆయన అధి కారులను ఆదేశించారు.
రెండువైపులా మొదలు పెట్టిన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం త వ్వకాలలో ఒక భాగం నుండి 21 కి లోమీటర్లు పూర్తి కాగా మరో వైపు 14 కిలో మీటర్లు పూర్తి అయిందని మిగిలిన తొమ్మిది కిలోమీ టర్లు పూ ర్తికి మూడు షిఫ్ట్ లలో పనిచేసేవి దంగా ప్రణాళికలు రూ పొందించు కుంటే నిర్ణిత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయ న్నా రు.ఆయా షి ఫ్ట్ లలో యువ ఇంజినీర్లను నియ మించి రోజువారీ పురోగతిని రికార్డ్ చేయాలన్నారు.
అందుకు గాను యువ ఇంజినీర్లకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు క ల్పించి సొరంగ మార్గం తవ్వకాల లో అనుభవం గడించేలా చూ డాలన్నారు. సవరించిన అంచనాల పరిధిలోనే ప్రాజెక్టును పూర్తి చేయా లని ఆయన ఏజెన్సీ లకు సూచిం చారు.ఎస్.ఎల్.బి.సి సొరంగ మా ర్గం తవ్వకాల సమయంలో వస్తున్న నీటిని పంపింగ్ చేయడానికి వి ద్యు త్ బిల్లులు సంవత్సరానికి 500 నుండి 550 కోట్లు చెల్లిస్తున్నామ న్నారు.పైగా పంపింగ్ కోసం విని యోగిస్తున్న మోటార్లు 20 సంవ త్సరాలు పూర్తి కావడంతో అదనపు భారాన్ని భరిస్తూ మోటార్లను మా ర్చాల్సి వస్తుందన్నారు.
ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్లయితే రోజుకు 0.3 టి.యం.సి ల నీటిని 90 రోజుల పాటు అందించవచ్చన్నారు.కాగా శ్రీశైలం నుండి 824 అడుగుల నుం డి ఎస్.ఎల్.బి.సి సొరంగ మా ర్గా నికి నీరు వస్తుండగా 840 అడుగు ల నుంసి పోతిరెడ్డి పాడుకు నీరు చేరుతుందని ఎస్.ఎల్.బి.సి పూర్తి అయితే అనధికారికంగా ఆంద్రప్ర దేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కు తరలించుకు పోయో అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారుప్రాజెక్టును పూర్తి చేసే అంశంలో వె నకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా ప్రధాన కార్య దర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్య దర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సల హాదారులు అదిత్యా దాస్ నాద్, లె ఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్, స హాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇ. ఎన్ సి లు అంజత్ హుస్సేన్, శ్రీని వాస్, రమేష్ బాబు లతో పాటు ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, సి.ఇ నల్గొండ అజయ్ కుమార్ త దితరులు పాల్గొన్నారు.