Snake: విష సర్పంతో భయం భయం
జిల్లా కేంద్రం జమ్మిగడ్డ 20వ వార్డు రోడ్ నెంబర్ 5 లో ఓ పాడుబడ్డ ఇంట్లో ఒక విష సర్పాలతో కాలనీ వాసు లకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తుం దని జమ్మిగడ్డ కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
పొంచి ఉన్న ప్రమాదంతో గుబులు
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
ప్రజా దీవెన, సూర్యాపేట: జిల్లా కేంద్రం జమ్మిగడ్డ 20వ వార్డు రోడ్ నెంబర్ 5 లో ఓ పాడుబడ్డ ఇంట్లో ఒక విష సర్పాలతో కాలనీ వాసు లకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తుం దని జమ్మిగడ్డ(Jammigadda)కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. శుక్రవారం ఆ ఇంటి ముందు పరిసర ప్రాంత వాసులు ఆందోళన చేస్తూ 3రోజుల క్రితం పాము(Snake) ఉందనే విషయం బయట పడినా అటవీ శాఖ అధికారులు(Forest Department officers)పట్టించుకోవడం లేదని ఆరోపిం చారు.ఆ పక్కనే పోస్ట్ ఆఫీస్(Post Office)ఉండడం అక్కడికి వచ్చే వికలాం గులు, ముసలి వాళ్లు ఆ ఖాళీ స్థలంలోకి కాలకృత్యాలకు వెళ్లడం కూడా జరుగుతుందని ఆ పాము ఎక్కడ కాటు వేస్తుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవు తున్నా రు.ప్రమాదం జరుగక ముందే నివారణ చర్యలు తీసుకోవా లన్నారు.ఇంటి యజమాని మృతి చెందారు. అతనికి పిల్లలు కూడా లేరు. అందువల్ల ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేశారని,ఎలాగైనా ఆ పాడుబడ్డ ఇంటిని పట్టణ ప్రగతిలో తొలగించి కాలనీ వాసులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
snake found in old house