South India mangalagiri : దక్షణభారతానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి
--చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ --పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా --ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే --పేదరికం లేని మంగళగిరి కోసం నా నిరంతర కృషి --పద్మశాలీయ బహూత్తమ సంఘం సామాజిక సేవలు భేష్ --మంగళగిరిలో కళ్యాణ మండపo ప్రారంభo సందర్భంగా నారా లోకేష్
దక్షణభారతానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి
—చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ
–పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా
–ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే
–పేదరికం లేని మంగళగిరి కోసం నా నిరంతర కృషి
–పద్మశాలీయ బహూత్తమ సంఘం సామాజిక సేవలు భేష్
–మంగళగిరిలో కళ్యాణ మండపo ప్రారంభo సందర్భంగా నారా లోకేష్
ప్రజా దీవెన, మంగళగిరి: పద్మశా లీయ బహూత్తమ సంఘం చేప డుతున్న సామాజిక సేవా కార్యక్రమా లు అన్నివర్గాలకు ఆదర్శనీ యంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ( naara lokesh) అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మ శాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా ని ర్మించిన కల్యాణ మండపాన్ని ( marr aiage hall) మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభిం చారు. శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయ ప్రాంగణా నికి చేరు కున్న లోకేష్, బ్రాహ్మణి దంపతు లకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనా రుషి స్వామి ఆలయాన్ని దర్శించు కొని లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్య క్రమంలో పాల్గొ న్నారు. ఈ సం దర్భoగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమవంతు సహాయ, సహ కారాలు అందిస్తా మని చెప్పారు. ఆలయ అభివృద్ధి కి ప్రభుత్వం ( government) తర పున పూర్తి సహకారం అందిస్తామ ని చెప్పారు.
మంగళగిరి ( manga lagiri) చేనేతలు తన ఆత్మ బంధు వుల ని, ఎన్నికల్లో వారు తనపై చూ పిన అభిమానం జీవితంలో మరువ లేనని అన్నారు. మంగళగిరి చేనే తకు గత వైభవం కల్పించేందుకు అన్ని చర్యలూ చేపడతానని చెప్పా రు.చేనేత కార్మికుల ఆదాయం పెం చడానికి పైలెట్ ప్రాజెక్టుగా ( project) వీవర్స్ శాల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామ ని అన్నారు. చేనేత లో భాగస్వామ్యం అయిన అన్ని విభాగాల కార్మికులకు ఆదా యం (income) పెరిగే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నాం, త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని లోకేష్ అన్నారు.
మంగళగిరిలో ఉన్న స్వర్ణ కారులకి (gold Smith) స్కిల్ డెవల ప్మెంట్ ద్వారా మెరు గైన డిజైన్లు తయారు చేసే శిక్షణ ఇస్తామని అ న్నారు, దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిది ద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటు కు కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలిపారు. మంగళగిరి లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనే క సమస్యలు ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని స్పష్టం చేశారు.
మూడు నెలలు రాజకీయాల కోసం పోరాడాం ఇప్పుడు 4 ఏళ్ల 9 నె ల లు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గం సం క్షేమం, అభివృద్ధి కోసం పని చేద్దాం అని లోకేష్ (lokhesh) పిలు పు ఇచ్చారు. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కల్యాణ మం డపం నిర్మించారని, సంఘం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో యువ త ను భాగ స్వామ్యం చెయ్యాలని, మంగళగిరి చరిత్ర తెలుసుకో వడంతో పాటు చరిత్రను కాపాడటం కోసం యువత అన్ని కార్యక్ర మాల్లో భాగస్వా మ్యం కావాలని లోకేష్ అన్నారు.
ఈ కార్య్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు ఆలయ అభివృ ద్ధి, చేనేత, స్వర్ణ కారుల సంక్షేమం కోసం మంత్రి లోకేష్ కు పలు సూచనలు చేశారు.జీఎస్టీ పై కేంద్ర ప్రభుత్వం తో చర్చించడం, ఒకవేళ కేంద్రం ఒప్పుకోక పోతే జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం పట్ల ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మురుగుడు హనుమంతు రావు అన్నారు.
పెద్దలందరితో చర్చించిన తరువాత అన్ని కార్యక్రమాలు చేపడతామ ని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగు డు హనుమంతురావు, పంచుమర్తి అనురాధ, నియోజకవర్గ సమ న్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గం సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాస్, పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్దలు పాల్గొన్నారు.
South India mangalagiri