Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Special Chief Secretary Vikas Raj : స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ కీ లక ఆదేశాలు, సవ్యంగా సీఎం ప ర్యటన జరిగేలా పటిష్ట చర్యలు చే పట్టాలి 

Special Chief Secretary Vikas Raj : ప్రజా దీవెన, నల్ల గొండ: రాష్ట్ర ము ఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం నాటి నల్గొండ జిల్లా పర్యటన ఆసాంతం ఎలాంటి ఇబ్బందులు లే కుండా సవ్యంగా సాగేలా ఏర్పా ట్లు ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. శు క్రవారం ఆయన నల్గొండ జిల్లా కేoద్రంలోనిఎన్ జి కళాశాల మైదా నంతో పాటు, కనగల్ లో రాష్ట్ర ము ఖ్య మంత్రి ఆవిష్కరించనున్న 13006 కోట్ల రూపాయల హ్యాం రోడ్ల శంకుస్థాపన పైలాన్ ను పరిశీ లించారు. ముందుగా ఎ న్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్య మంత్రి హాజ రుకా నున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలను ఉద్దే శించి రా ష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించే సభా వేదిక, అలాగే సభకు హాజరయ్యే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, టెంట్లు, జ ర్మన్ హాంగర్స్, లైటింగ్, సౌం డ్, ఎల్ఈడి ,బ్యారికేడింగ్, ఇ లా ఒక్కో అంశాన్ని సంబంధిత అధికారుల ద్వారా అడిగి తె లుసుకున్నా రు. ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా ఉండాలని, ఎ క్కడ లోటు జరగ కుండా చూసుకోవాలని ముఖ్య మంత్రి న ల్లగొండ జిల్లాలో అ డు గు పెట్టినప్పటి నుండి తిరిగి వెళ్ళి పోయే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటన మొ త్తం సవ్యంగా సాగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ ట్టు గా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

కాగా ఎన్జీ కళాశాల మైదానంలో ఒకవైపు రాష్ట్ర ముఖ్యమం త్రి ప్రసంగించే బహిరంగ వేదిక దానికి ఎ దురుగా ప్రజలు ఆ సీనులయ్యేందుకు కుర్చీలు,వర్షం వచ్చినా తట్టుకునేలా జ ర్మన్ హాంగర్స్ తో టెంట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా వేదిక ఎడమవైపున వైపున కూడా టెంట్లు వేస్తు న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్జీ కళాశాల మైదానం చేరు కున్న వెంటనే రెం డువైపులా ఉండే ప్రజలకు అభివాదం చే సే విధంగా గ్రౌండ్లో ఇదివరకే ఉన్న కాంక్రీట్ వేదికను కూడా సి ద్ధం చేయాలని, అక్కడినుండి రా ష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కు అభివాదం చేసేలా చర్యలు తీసుకోవాలని ఇందుకుగాను ముఖ్యమంత్రి ర్యాంప్ లేదా వాహనం ద్వారా అక్కడికి వచ్చే లా ఏర్పాటు చేయాల ని, గట్టి బందోబస్తు ఏర్పాటు చే యా లని చెప్పారు.

ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కల గకుండా అన్ని ఏర్పాట్లు కల్పించా లని ఆయన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ లను ఆదేశించారు. ఈ సంద ర్భం గా వికాస్ రాజ్ జిల్లా పోలీసు శిక్ష ణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వివరాలు కూ డా ఎస్పీ ద్వా రా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయ న జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర ము ఖ్యమంత్రి కనగల్ మార్కెట్ యార్డు సమీపంలో ఆవిష్కరిం చనున్న హ్యాంరోడ్ల పైలాన్ ను పరి శీ లించారు. పైలాన్ కు వినియోగించే రంగులు, సుందరీకరణ పనులు అన్నింటి గు రించి ఆర్ అండ్ బి అధి కారుల ద్వారా అడిగి తెలుసుకు న్నారు. అక్కడ కూడా ఎలాంటి ఇ బ్బందులు లేకుండా గట్టి బందో బ స్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. పక్కనే ఉన్న హెలిప్యాడ్ ను ఆయన పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ,రెవె న్యూ అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి,హ్యం రోడ్ల సీఈ వి. వెంకటేశ్వర రావు, రో డ్లు భవనాల సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీరు గణేష్ ,డిప్యూ టీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి, సంబంధిత జిల్లా అధికారు లు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధి కారులు ఉన్నారు.

Related Articles

Back to top button