Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 2:09 pm Posted by : praja deveena

Special Tet for Service teachers : బిగ్ బ్రేకింగ్, ఇన్-సర్వీస్ ఉపాధ్యా యులకు తీపికబురు, ప్రత్యేకంగా మరోరెండు అదనపు టెట్ పరీక్షల కు నిర్ణయం

 

Special Tet for Service teachers :  ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యా యులకు అదిరిపోయే తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభు త్వం. సర్వీసులో ఉంటూ ప్రమోషన్ల కో సం లేదా సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర కారం అర్హత కోసం ఎదురుచూ స్తు న్న టీచర్లకు ఒకేసారి రెండు బంప ర్ ఆఫర్లను ప్రకటిస్తూ విద్యాశాఖ కీల క నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్ర తి ఏటా జరిగే రెండు సాధా రణ టె ట్ (TET) పరీక్షలతో పాటు కేవలం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోస మే ప్రత్యేకంగా మరో రెండు అదన పు టెట్ పరీక్షలను నిర్వహించను న్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్య దర్శి డాక్టర్ యోగితా రాణా అధి కారికంగా మెమో జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పూర్వపరా లు ఇలా ఉన్నాయి.సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర కారం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు కూడా టె ట్ అర్హత తప్పనిసరి అయింది. దీంతో ప్రమోషన్లు పొందాలన్నా, స ర్వీసులో ఎలాంటి ఇబ్బందులు లే కుండా కొనసాగాలన్నా టెట్ పాస్ కావడం అత్యవసరంగా మారింది.ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఇ బ్బందులను గుర్తించిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, అలాగే PRT U-TS, STU-TS, TRTF వంటి ప్ర ముఖ ఉపాధ్యాయ సంఘాలు ప్ర భుత్వానికి వరుస విజ్ఞప్తు లు చేశాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీ లించిన ప్రభు త్వం, విద్యాశాఖ డై రెక్టర్ & టెట్ చైర్మన్ నివేదికల ఆ ధారం గా ఈ స్పెషల్ టెట్ నిర్ణయా న్ని తీసుకుంది.

     టాప్-3 ప్రయోజనాలు ఇవే

సాధారణ అభ్యర్థులతో (నిరుద్యో గులతో) పోటీ పడాల్సిన అవసరం లేకుండా, కేవలం ఇన్-సర్వీస్ టీ చ ర్ల మధ్యే ఈ పరీక్ష జరుగుతుంది. టెట్ క్వాలిఫై కాకపోవడం వల్ల నిలి చిపోయే పదోన్నతులకు (Promot ions) ఈ నిర్ణయంతో మార్గం సుగ మం అవుతుంది.ఏడాదికి సాధార ణంగా వచ్చే 2 అవకాశాలతో పా టు, ఈ అదనపు 2 ప్రత్యేక అవకా శా లు కలసి రావడం పెద్ద ప్లస్ పా యింట్ గా నిలుస్తోంది.

     రేపో మాపో నోటిఫికేషన్

ఈ ప్రత్యేక టెట్ పరీక్షల నిర్వహణ కు సంబంధించి తక్షణమే అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్ట ర్‌కు ప్రభుత్వం స్ప ష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉపా ధ్యాయ సంఘాల సుదీర్ఘ పో రాటానికి ప్రభుత్వం నుంచి ల భించిన ఈ తీపి కబురుతో ఉపాధ్యా య లోకంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ఈ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.