Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 10:50 am Posted by : praja deveena

Sports minister Vakiti Srihari : మంత్రి వాకిటిశ్రీహరి కీలక వ్యాఖ్య, తెలంగాణ యువజన సర్వీసులశాఖ ఓ కర్మాగారంగా మారాలి

 

Sports minister Vakiti Srihari :  ప్రజాదీవెన, హైదరా బాద్: సీఎం రే వంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలో క్రీ డల అభి వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూ పుతున్నందున్న, తెలంగాణను క్రీ డారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని అధి కారులకు మంత్రి సూచించారు. పాఠశాల విద్య నుంచి యూనివర్శిటీ విద్యాల యాల వరకు అన్ని వస తులతో క్రీడాస్టేడియాలు, మౌలిక సదుపాయాల ఏర్పా టు ప్రత్యేక చొ రవ చూపాలని రాష్ట్ర పశుసంవర్ధ క, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్య్స, యువజ న సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రమశిక్షణతోనే క్రీడాకా రు లు ఉన్నతస్థాయికి చేరుతారని, క్రీడలతోపాటు విద్యార్థి, యువజ నులకు క్రమశిక్షణ కూడా అలవరు చుకునేలా శిక్ష ణ ఇవ్వాలని మంత్రి వివరించారు. యువజన సర్వీసు లు, క్రీడలశాఖలకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులపై డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత అ ధికారులతో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారి శ్రామికాభి వృద్ధి, మత్య్స, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీ హరి సమీక్ష నిర్వ హించారు.

స్పోర్ట్స్‌ స్కూల్క్‌ అభివృద్ధి, హాకీం పేట, వనపర్తి, వరంగల్ వంటి ప్రాంతాల్లో స్కూళ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్ర ణాళికలు రూపొందించాలని తెలిపారు. తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను తయారు చేసేలా ప్రభుత్వం ముందు కుపోతుందని, అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చి పనిచేయాల్సి న బాధ్యత మనపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్‌ స్కూళ్లలో డ్రాపవుట్స్‌ కాకుండా ఏ దో ఒక క్రీడలో ప్రతిభచాటి ఉన్నత స్థాయి ఎదిగేలా విద్యార్థు లను తయారు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి వివరించా రు. అసెంబ్లీ ని యోజకవర్గాల్లో స్టేడియాల ఏర్పా టు, ఆటల అభివృద్ధి కోసం ఎమ్మె ల్యేలు ఆసక్తి చూపుతున్నారని, వా రి అభిప్రాయాలను కూడా తీసుకొని ఆయా నియోజకవర్గాల్లో కావా ల్సిన పనులను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ కేటా యింపులు ఉం డాలని అధికారులకు సూచించారు. క్రీడా పాలసీ ద్వారా ఏం చేయబోతున్నాం?, కోచ్‌లకు వేతనాలు ఏ స్థాయిలో ఇస్తున్నాం? క్రీడాకారు లకు ఆర్థిక సహాయం ఎంత ఇస్తున్నాం? మౌలిక సదుపాయాల విషయంలో ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం? వంటి అంశాలు బడ్జెట్‌ లో సమ గ్రంగా ఉండాలని స్పష్టంచేశారు.

గతంలో కంటే మెరుగ్గా 2026-20 27 బడ్జెట్‌ ఉండాలని ఆ కాంక్షించారు. ఈ సమావేశంలో క్రీడలకు సం బంధించిన ప్ర తిపాదనలను మంత్రి కి స్పోర్ట్స్ అథారిటి ఎండీ సోనిబా లా దేవి వివరించారు. క్రీడలపై వి ద్యార్థుల తల్లిదండ్రులకు అవ గాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. తెలంగాణలో ఆటలు అద్భుతంగా ఉండాలని, అందుకు అనుగుణంగా బ డ్జెట్‌ రూపకల్పన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సె క్రటరీ జయేష్ రంజన్‌కు మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు.

యువజన సర్వీసుల శాఖ ఒక కర్మాగారం కావాలి….

తెలంగా ణ యువజన సర్వీసుల శాఖ ఒక కర్మాగారం కా వాలని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శా ఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సెట్విన్, స్టెప్‌ లు తెలంగాణ యువ తకు ఉపాధి చూపించే కేంద్రాలు కా వాలని మంత్రి అకాంక్షించారు. అం దుకోసం ప్రతి నియోజవర్గ కేం ద్రం లో 2 ఎకరాల వైశ్యల్యం తో ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేసి యువతీ, యువకు లకు శిక్షణ ఇచ్చేలా ప్ర ణాళికలు రూపొందించాలని అధి కారులకు సూచించారు. సెట్విన్‌ లో శిక్షణ తీసుకున్నవారు ఎక్కడై నా పనిచేసేలా ఒక గుర్తింపు ఇచ్చేలా శిక్షణ ఉండా లని మంత్రి వా కిటి శ్రీహరి అధికారులకు సూచించారు. రా ష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సెట్విన్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

యువజన సర్వీసుల శాఖను బలోపేతం చేసేలా ఈ బడ్జెట్ ఉండా లని వివరించారు. ఈ సమావే శంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌, రాష్ట్ర స్పోర్ట్స్ అథా రి టీ ఎండీ సోనిబా లాదేవి, డెరెక్టర్‌ బాషా, స్పోర్ట్స్‌ విభాగం అ డ్మినిస్ర్టేటర్‌ అనిత, అ కౌంటెంట్‌ సుజాత, డిప్యూటీ డైరె క్ట ర్లు రవీందర్, రవితేజ, ఈఈ శ్రీని వాసరావు, సెట్విన్‌ ఎండీ ఎం ఉ పేందర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ టి ఓంప్రకాశ్‌, అకౌంట్‌ ఆఫీసర్ జి శ్రీ నివాస్, తెలంగాణ రాష్ట్ర స్టెప్‌ మేనేజర్ జే నా గేందర్‌ లు పాల్గొన్నారు.