Spot admissions: ఇంటర్ లో స్పాట్ అడ్మిషన్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులల ఆర్సిఓ లక్ష్మయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా దీవెన నల్గొండ టౌన్: ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్(Intermediate first year) ప్రధమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్(spot counselling) కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులల ఆర్సిఓ లక్ష్మయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
2023-24 విద్యా సంవత్సరము పదవ తరగతిలో పాస్ అయిన విద్యార్ధుల కు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (బాలుర) అవంతిపురం, మిర్యాలగూడ నందు ఈనెల 23న బాలురకు, 25న బాలికలకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సూచించిన తేదీన విద్యార్ధులు ఉదయం 9.00 గంటల కు తమ ఒరిజినల్ టిసి, మేమో, స్టడీ అండ్ కండక్ట్, కుల, ఆదాయ ధృవీకణ పత్రములు, వాటి జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డ్, 3 కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో లతో స్పాట్ అడ్మిషన్ కు హాజరు కావాలని తెలిపారు.
Spot admissions in Inter