శ్రీశైలం మల్లన్న దర్శనాల్లో పలు మార్పులు
ప్రజా దీవెన, శ్రీశైలం:ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం,అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న క్షేత్రంలో స్వామి,అమ్మవార్ల దర్శనాల్లో ఆల య ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని,ఆది, సోమవారాలు,ప్రభుత్వ సెలవు రోజులు,దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో భక్తు లందరికీ కేవలం శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిం చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పలు సేవలను నిలుపుదల చేస్తూ దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసిం ది.శ్రీస్వామివారి గర్భాలయ అభి షేకం (రూ.5000), ఉదయా స్త మాన సేవ (రూ.1,01,116), ప్రాతః కాల సేవ (రూ.25,116), ప్రదో షకాల సేవ (రూ.25,116), సామూ హిక అభిషేకము (రూ.1500) ,శ్రీస్వామివారి స్పర్శదర్శనం (రూ.5 00),వీఐపీ బ్రేక్ (రూ.500), అ మ్మవారి ముఖమండపంలో కుం కుమ పూజలను నిలుపుదల చేశా రు.
Srishailamtemple