Opinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

State Chief Information Commissioner : రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్య, సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధం

State Chief Information Commissioner : ప్రజా దీవె న నల్లగొండ: ప్రభుత్వ అ ధికార యంత్రంగాలలో పారదర్శక త, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర స మాచార కమిషన్ ప్రధాన కమిషనర్ విశ్రాంత ఐఎఫ్ఎస్ అ ధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆ యన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అ ధికారులు, అధికార యంత్రాంగాలకు ఉద్దేశించి ఏర్పాటు చే సిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ప్రజాస్వామ్య దేశంలో సమాచారం ఉంటేనే ప్రజలకు ఉ పయోగమని, అయితే అలాంటి సమాచారాన్ని అందించే బాధ్యత పబ్లిక్ అథారిటీలపై ఉందని అన్నారు. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతగా సేవలు అందించేందు కు సమా చార హక్కు చట్టం ఉపయోగపడతుందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని మరువరాదని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టంలోని చాప్ట ర్లు, సెక్ష న్లు, ఉపవిభాగాలు తదిత అంశా లపై ఆయా సెక్షన్ల వారిగా కూలంక షంగా వివరించారు. సమాచారచట్టం ప్రకా రం సమాచారాన్ని కోరే హక్కు పౌరునికి ఉండడంతో పా టు, రికార్డులను, క్షేత్రస్థాయిలో పను ల ను తనిఖీ చేసే అధి కారం కూడా ఉందని తెలిపారు.అధికార యంత్రాంగాలు పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా సమా చార హక్కు చట్టం, సెక్షన్ 4 (1 )బి ప్రకారం స్వచ్ఛందంగా స మాచారం ఇచ్చేలా అధికార యంత్రంగాలు తయారు కావా లని, ముఖ్యంగా పబ్లిక్ అథారిటీ బాధ్యతలు, విధులు ,నిర్వ ర్తించే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు 4 (1) బి రిజి స్టర్ లను అప్డేట్ చేసుకోవాలని, వీటన్నిటిని ప్రజలకు తెలి సే విధంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.

 

పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అధికా ర యంత్రాంగాలపై ఉందని అన్నారు. రా ష్ట్రవ్యాప్తంగా స మాచార హక్కు చట్టం కింద 1,20,000 దరఖాస్తులు వస్తే లక్ష మందికి సమాచారం ఇచ్చిన ఘనత రాష్ట్రానిదన్నా రు.150 00 నుండి 20వేల వరకు అప్పీల్స్ రాష్ట్ర సమాచా ర కమిషన్ కు వ స్తున్నాయని తెలిపారు. గడచిన పది నెల ల్లో 15 వేల కేసులను రాష్ట్ర సమాచార కమిషన్ పరిష్కరిం చి నట్లు ఆయన వెల్లడించారు.

కావాలని సమాచారం ఇవ్వని15 మంది పౌర సమాచార అ ధికారు లపై చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని, ఇప్ప టివరకు18 జిల్లాలను రాష్ట్ర సమాచార కమిషన్ ప ర్యటిం చిందని,4,5 సంవత్సరాలకు పాత కేసులు అన్నింటిని ప రి ష్కరించడం జరిగిందని, ప్రస్తుతం కమిషన్ వద్ద 10 వేల కే సులు పెం డింగ్ లో ఉన్నాయని,మే 15 నాటి కి రెవెన్యూ, మున్సిపల్ తప్ప త క్కిన అన్ని కేసులు పరిష్కరిస్తామ ని చెప్పారు. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరుకు న్న సమాచారాన్ని పొందే అవకాశం ఉ న్నందున పిఐవోలు ,అధికార యం త్రంగాలు ప్రజల పక్షాన ఆలోచించి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మూడవ పా ర్టీ ఇన్ఫర్మేషన్, వ్యక్తులు అడిగే స మాచారం ఇవ్వవలసిన సమాచారం, ఇవ్వకూడని సమాచారం, తదితర వివరాలను తెలియజేశారు.

 

రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు భారతదేశం లో అమలు చేస్తున్న వివరాలు తె లియజేస్తూ అధికార యంత్రంగా లు, పిఐఓలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన పెం చుకోవాలని అన్నారు. ప్రపంచంలో సమాచార హక్కు చట్టం అమల్లో భా రతదేశం నాలుగో స్థానంలో ఉంద ని ఆయన వెల్లడించారు.1766 లో స్వీడన్ దేశంలో సమాచార హక్కు చట్టం కమిషన్ అమలు చేయడం ప్రారంభమైందని, 2005 సంవత్స రంలో భారత దేశంలో ఈ చట్టం అమల్లోకి వచ్చిన ట్లు వెల్లడించారు.

 

మరో సమాచార కమిషనర్ భోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లా డుతూ సమాచార హక్కు చట్టం అమలు, ఉద్దేశాలు, 41b కింద ఇచ్చే సమాచా రం తెలియజేస్తూ ఎప్పటికప్పుడు 4( 1) (బి) రిజిస్టర్ వివరాలను అ ప్డేట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రంగాల పై ఉందని, 60 నుం చి 70% అప్పీ ల్స్ ఫోర్ వన్ బి పైనే వస్తున్నాయని, మరింత సమర్థవం తం గా చట్టాన్ని అమలు చేయాల్సి న బాధ్యతను ఆయన తెలి పారు.

మరొక కమిషనర్ పీవీ. శ్రీనివాసరా వు మాట్లాడుతూ సమా చార హక్కు చట్టంలోని 6(3) కింద దరఖా స్తును బాగా పరి శీలించి, చదివి ఇ తర పిఐఓలకు పంపించాలని, మొ దటి అథారిటీ సరైన విధంగా చర్య తీసుకుంటే రెండవ అప్పులె ట్ అథారిటీకి ఎలాంటి అప్పీల్స్ రావని, అలాగే రికార్డులు సరిగా నిర్వహించాలని సూచించారు.

చివరగా రాష్ట్ర సమాచార కమిష నర్ మోషిన్ పర్వీన్ మా ట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషన్ ద్వారా వచ్చే నోటీసు లు, వాటికి తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ఫోర్ వన్ బి రిజిస్టర్, దరఖాస్తుల రిజిస్టర్, ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ తదితర అంశా లను వివరించారు.

 

సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ మాట్లా డుతూ సమాచార హక్కు చట్టం అమలులో భా గంగా జిల్లాలో ఎ ప్పటికప్పుడు దరఖాస్తులను జిల్లా మండ ల అధికారులతో సమీక్షించ డం జరుగుతున్నదని, అదేవి ధంగా అప్పీల్లను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదన పు కలెక్ట్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలె క్టర్ వై. అశోక్ రెడ్డి, డిఎఫ్ఓ రా జశేఖర్, ఆర్ డి ఓ లు, జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు ఉన్నారు.

Related Articles

Back to top button