Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 1:33 pm Posted by : praja deveena

Supreme Court Trauma Care Verdict : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ప్రాణం మీదికొస్తే ‘ట్రామా కే ర్’ ఇక మీ ప్రాథమిక హక్కు 

Supreme Court Trauma Care Verdict : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: రోడ్డు ప్ర మాదం జరిగి రక్తం ఓడుతున్న వేళ హా స్పిటల్ బెడ్ దొరక్కపోతే డ బ్బులు కడితేనే గానీ డాక్టర్ ము ట్టుకోనంటే ఇకపై ఇలాంటి భయా లకు కాలం చెల్లింది. గురు వారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారి త్రాత్మక, సంచలన తీర్పును వెలువరించింది. సకాలంలో అ త్యవసర వైద్యం (Trau ma Care) అందడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు లోని ముఖ్యాంశాలు రేపటి నుంచి మారబోయే విధివిధానాలు ఇలా ఉండబోతున్నాయి. ప్రమాదం జరి గి న ప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలియక తికమకపడే రోజు లు పోయాయి. రాబోయే 3 నెలల్లోగా దేశవ్యాప్తంగా ఒకే ఒ క్క అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 112 ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేం ద్రపాలిత ప్రాంతాలను ఆదేశిం చింది.

ప్రతి నిమిషం విలువైనదే ప్రమా దం జరిగినప్పుడు ప్రతి ని మిషం ఒక ప్రాణంతో సమానం. వైద్యం ఆలస్యమైతే జరిగే నష్టం పూడ్చలేని ది. త్వరితగతిన స్పందించడమే అ న్నిటి కంటే అసలైన మందు అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. హాస్పిటళ్లు ఇకపై “ముందు పైసలు కట్టండి, లేదా పోలీస్ కేస్ అయ్యాక చూస్తాం” అంటూ కాలయాపన చే యడానికి వీల్లేదు. బాధితుడిని బ్రతికించడమే ప్రథమ కర్తవ్యంగా ఆ స్పత్రులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోర్టు చకి త్ చేసింది.

 

రోడ్డు పక్కన ఎవరైనా ప్రమాదంలో ఉంటే పోలీసుల గొడవ ఎందుకని ముఖం తిప్పేసుకునే రోజులకు సు ప్రీంకోర్టు చెక్ పెట్టింది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడేందుకు ముం దుకు వచ్చే వారికి పూర్తి చట్టపర మైన రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. పోలీసుల విచారణల పే రుతో, కోర్టుల చుట్టూ తిప్పుతూ స హాయం చేసిన వారిని వేధించడాని కి వీల్లేదని చెప్పుకొచ్చింది. ఈ విప్ల వాత్మక మార్పులు కేవలం కాగితా లకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థా యిలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 3 నెలల గడువు వి ధించింది సుప్రీంకోర్టు.

ఇకపై రోడ్డు మీద ప్రాణాపాయ స్థి తిలో ఉన్న ఏ ఒక్కరికీ వైద్యం దూ రం కాకూడదు. ఈ తీర్పుతో దే శంలో హెల్త్‌కేర్ సిస్టమ్ రూపురేఖ లు మారబోతున్నాయని సుప్రీం కోర్టు తీర్పు పై హర్షం వెలిబుచ్చు తూ అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నా రు పరిశీలకులు. మొత్తానికి దే శం లో అత్యున్నత న్యాయస్థానం ఆ దేశాలతో రోడ్డు మీద మనిషి ప్రా ణానికి భద్రత లభించినట్లవుతు oదని భావిస్తున్నారు.