‘Supreme’ indignation on Manipur incident మణిపూర్ ఘటనపై ‘ సుప్రీం ‘ మండిపాటు
-- ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదెందుకు --విచారణ కోసం ప్రత్యేక కమిటీకి నిర్ణయం --నిపుణులతో కమిటీలో ఇద్దరు మహిళా జడ్జిలకు చోటు --సమగ్ర నివేదిక సమర్పించాలన్న సర్వోన్నత న్యాయస్థానం
మణిపూర్ ఘటనపై ‘ సుప్రీం ‘ మండిపాటు
— ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదెందుకు
–విచారణ కోసం ప్రత్యేక కమిటీకి నిర్ణయం
–నిపుణులతో కమిటీలో ఇద్దరు మహిళా జడ్జిలకు చోటు
–సమగ్ర నివేదిక సమర్పించాలన్న సర్వోన్నత న్యాయస్థానం
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (manipoor) లో ఇద్దరు మహిళలను నగ్న ప్రదర్శన ( Nude show) పై సుప్రీంకోర్టు తీవ్ర స్ధాయిలో స్పందించింది. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన మణిపూర్ అంశం విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు(state police) అనుసరించిన నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీని ( ఏర్పాటు చేస్తామని, కమిటీలో నిపుణులతో పాటు ఇద్దరు A special committee for inquiry) మహిళా జడ్జిలు కూడా ఉంటారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి సుప్రీం కోర్టు(supreem court) వాయిదా వేసింది. మణిపూర్ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయ స్థానం ప్రశ్నించింది. ఎఫ్ఎస్ఐఆర్ (fir) దాఖలుకు 14 రోజులు ఎందుకు పట్టిందని, అన్ని రోజులు ఏం చేశారని నిలదీసింది. మే 4న హింస వెలుగులోకి వస్తే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయడానికి 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని కేం ద్రాన్ని ప్రశ్నించింది. ఈ అంశంలో ప్రభుత్వ వైఫ ల్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (judge Chandra chood) బెంచ్ దీనిపై ఇవాళ విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మే నెలలో ఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్ని ఎఫ్ఎర్లు నమోదు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసుకు సం బంధించిన అరెస్టులు, ఎఫ్ఎస్ఐఆర్ వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. మణి పూర్లో జరిగిన హింసను అదుపు చేయాలంటే విస్తృతమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మణిపూర్ ఘటన విచారణను అసోం (assom)కు బదిలీ చేయడాన్ని బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నా రని బాధితుల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ కేసును బదిలీ చేయాలని తాము కోరలేదన్నా రు. లైంగికదాడి ( sexual assault) కి గురైన ఒక మహిళ తండ్రి, సోదరుడు హత్యకు గురయ్యారని, వారి మృతదే హాలను ఇంకా గుర్తించలేదని కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణ కోసం మహిళలతో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయాలని మరో న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. దీనికి స్పందించిన న్యాయస్థానం. ఈ ఘటనపై వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది. కమిటీలో మహిళా న్యాయవాదులు కూడా ఉంటారని తెలిపింది. ఈ కేసు విచార ణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తానంటే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్ మెహతా తెలిపారు. మరోవైపు మణిపూర్ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరుతూ మైతేయిలు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒక వర్గాన్ని దోషిగా చూపించేలా పిటిషన్లను విచారించడం(Hearing of petitions) కుదరదని వెల్లడించింది. కేసు వి చారణను మంగళవారానికి వాయిదా వేసింది.