SupremeCourt : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: భారత స ర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియోజ కవర్గాల పునర్విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటి షన్ పై విచారణ పూర్తిచేసిన ధర్మాసనం సదరు పిటిషన్ ను తిర స్కరించింది.
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 20 14లోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కి, తెలం గాణలో 119 నుంచి 153కి పెంచాలని కోరుతూ ప్రొఫెసర్ కె.పురు షోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివే సింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కో టీశ్వర్ సింగ్‌లతో కూడిన సు ప్రీంకోర్టు ధర్మాసనం ఈతీర్పును నేడు వెలువరించింది. ఆంధ్రప్ర దేశ్ మరియు తెలంగాణలలో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కోసం దాఖలైన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం తిర స్కరించింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, 20 26 తర్వాత మొదటి జనాభా లె క్క లు (సెన్సస్) పూర్తయిన తర్వాత మాత్రమే ఇటువంటి పున ర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రత్యేక డీలిమిటే షన్‌ను మాత్రం సుప్రీంకోర్టు స మర్థించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురితమైన తర్వాతే డీ లిమిటేషన్ సాధ్యమని కోర్టు స్ప ష్టం చేసింది. సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించిన క్రమంలో తాజా పరిణామాలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం కానుంది.