Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 9:05 am Posted by : praja deveena

Supremecourt sensational orders : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన ఆదేశo, అన్ని హైకోర్టు లకు రిజర్వు తీర్పులపై కొత్తగాఫాస్ట్ ట్రాక్ రూల్స్

 

Supremecourt sensational orders : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయవ్యవస్థలో సమూల మా ర్పలు తీసుకురావడంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయాలు తీసుకుం టుoది. అందులో భాగంగా తాజా గా తీర్పుల కోసం ఏళ్ల త రబడి కో ర్టుల చుట్టూ తిరిగే రోజులకు కా లం చెల్లిందన్న భా వనతో న్యాయ వ్యవస్థలో సరికొత్త వేగాన్ని జవాబు దారీత నాన్ని తీసుకొస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం (సు ప్రీం కోర్టు) అన్ని రాష్ట్రాల హైకోర్టులకు బుల్లెట్ వేగంతో కూ డిన సరికొత్త గై డ్‌లైన్స్‌ను జారీ చేసింది.

“కేసు వాదనలు ముగిశాయా అయితే తీ ర్పు కోసం నెలల తరబడి నిరీ క్షించాల్సిందే” అనే పాత పద్ధతికి సుప్రీంకోర్టు చరమగీతం పాడుతూ డిజిటల్ యుగంలో న్యాయం కూడా అంతే వేగం గా ప్రజలకు అందాలనే సంకల్పంతో సుప్రీంకోర్టు విధించిన ఆ ఫాస్ట్ ట్రాక్ రూల్స్ ఇవే కావడం విశేషం.

తీర్పుల అప్‌లోడింగ్‌కు సరికొత్త డెడ్‌లైన్స్

కోర్టులో తీర్పును రిజర్వ్ చేసిన త ర్వాత, దానికి సంబంధిం చిన పూర్తి కారణాలతో కూడిన సమగ్ర తీర్పు ప్రతిని (Judg ment Copy) కేవ లం 7 రోజుల్లోపు అధికారికంగా అ ప్‌లో డ్ చేయాలి. అదే సమయం లో కేసు అత్యంత సంక్లిష్ట మైన దైతే, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ గడువును 15 రోజు లకు పెంచు కునే వీలుంటుంది. అంతకుమించి ఒక్క రోజు కూడా ఆలస్యం చేయ డానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

ఇక మరొక గైడ్ లైన్ ప్రకారం కోర్టు రూమ్‌లో జడ్జి తీర్పును ప్రకటించి న వెంటనే, ఆ మరుసటి 24 గంట ల లోపే దాన్ని కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. దీనివల్ల సామా న్య ప్రజలకు, లాయర్లకు తీ ర్పు కాపీల కోసం ఎదురుచూపు లు తప్పుతాయి. కాగా ఈ రూల్స్ అ న్నింటికంటే హైలైట్ ఏంటంటే ఒక వేళ వాదనలు పూర్తయి, తీర్పు రి జర్వ్ చేసిన తర్వాత 3 నెలల వర కు ఎలాంటి తీర్పు వెలువడకపోతే, ఆ కేసు నేరుగా సదరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief jus tice) దృష్టికి వెళ్తుంది.

దీనివల్ల ఏ జడ్జి వద్ద ఏ కేసు పెం డింగ్‌లో ఉం దో నేరుగా ప ర్యవేక్షించే అవకాశం లభిస్తుంది.ఈ చారిత్రాత్మక మార్పు లతో దేశ వ్యాప్తంగా ఉన్న హైకోర్టు ల్లో ఫైళ్ల గుట్టలు కరగను న్నాయి. సాంకేతికతను వాడు కుం టూ న్యాయవ్యవస్థ ను ప్రజలకు మరింత చేరువ చేసేం దు కు సుప్రీంకోర్టు వేసిన ఈ అడుగు మున్ముందు కోర్టుల రూపురేఖలనే మార్చేయబో తోందని పరిశీలకులు భావిస్తున్నారు.