OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Suryapet District SP Narasimha : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో భద్రత కమిటీలు

-- సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

 

Suryapet District SP Narasimha : ప్రజా దీవెన, సూ ర్యాపేట: ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక లో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్ర మం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టే షన్ లో జరిగిన సమావేశంలో వారం రోజుల అరైవ్ అలై వ్ రోడ్డు భద్రత కార్యక్రమాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నర సింహ ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మా ట్లాడుతూ ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడం రోడ్డు ప్ర మాదాలను అరికట్టడం ఏ ఒక్కరూ రో డ్డు ప్రమాదాలలో మ రణించకూడదు అనే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి అ రైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత ఉద్యమ కార్యక్రమానికి శ్రీ కా రం చుట్టారని, దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలతో భాగస్వామ్యమై రోడ్డు భద్రత పట్ల విస్తృతంగా చైతన్య వం తం చేస్తున్నామని ఎస్పీ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్రజా పాలన ప్ర గతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా వారం రోజులపాటు రోడ్డు భద్రత అవగాహన కార్య క్ర మాలు నిర్వహిస్తున్నాము, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారం రోజుల కార్యక్రమాలను సూర్యాపేట ప ట్ట ణ పోలీస్ స్టేషన్ నందు స్థానిక ము న్సిపల్ ప్రజాప్రతినిదులతో కలిసి ప్రారం భించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో బాధ్యతగా ఉంటా మని సమావేశానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించడం జ రిగినది.

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అవ గాహన కల్పిస్తూ సీనియర్ సిటిజన్స్ కు కొంత మందికి హె ల్మెట్ అందించారు. రోడ్డు ప్రమాదాలు సంబంధించి ఏ ఒక్క రు ప్రాణాలు కోల్పోవద్దు, ప్ర జల ప్రాణాలను కాపాడాలనే ఉ ద్దేశ్యంతో అన్ని శాఖల సమన్వయం తో రహదారి భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిన్నపిల్ల ల నుండి వృద్ధుల వ రకు రోడ్డు మీద ప్రయాణం చేసే టప్పు డు నియమ నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు.

జిల్లాలో చేపట్టిన రోడ్డు భద్రత అ వగాహన సదస్సులు రోడ్డు ప్రమా ద నివారణ చర్యల వల్ల సూర్యా పేట జిల్లాలో 202 4వ రోడ్డు ప్రమా దంలో 278 మంది చనిపోతే 202 5లో ఆ సంఖ్యని 230 కి తగ్గించా మని అన్నారు. దేశంలో సంవత్స రానికి 150000 మందికి పైగా ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి అ భ్యంతరంగా చనిపోతున్నారని తెలిపారు. జాగ్రత్త లు పాటించకుండా ప్రయాణించి రోడ్డు ప్రమాదాలు పారిన పడిన సంఘటన గుర్తు చేశారు. వాహనాలు పెరిగాయని, రో డ్ల సౌకర్యం పెరిగినది, అయితే అతివే గంతో ప్రయాణం చే యవద్దని ఆయన చెప్పారు.

జిల్లాలో ప్రమాదాలు తగ్గించడానికి ప్రజల ప్రాణాలు కాపాడ డానికి పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నా రు. సూర్యాపేట ప ట్టణంలో నివసిస్తున్న జనాభాకు 1 80 మంది పోలీసులతో నిరంతరం రక్షణ కల్పిస్తున్నాం, ప్రజలం దరూ కూడా ఏదైనా ప్రమాదాలు గానీ నేరాలుగా జరిగిన ప్పుడు వారు కూడా తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజ ల ఆస్తులకు, ప్రాణ రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్య త ఇస్తుందని అన్నారు. జిల్లాలో 2024 లో‌500 దొంగతనా లు జరిగితే ఇప్పుడు 300కి తగ్గించడం జరిగిందని అన్నా రు. సీసీటీవీలు పెం చాలని సిసిటివి కెమెరాలుపెంచడం ద్వారానే సమాజంలో నేరాలని తగ్గించగలుగుతామని ఆ యన అన్నారు.

మహిళలపై, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. మహిళా భద్రత కు అత్యంత ప్రా ధా న్యం ఇస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణకోసం డ్రైవర్లకు పోలీ సుల ఆధ్వర్యంలో 1500 మందికి పైగా డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాం, అద్దాలు, మందులు అందించామన్నారు.రోడ్డు ప్రమా దా లలో దాదాపు 99 శాతం మా నవ తప్పిదాల వలన జరుగు తున్నాయని, అతివేగంగా పోవడం నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చే యడం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మా ట్లాడుతూ వాహనం నడపడం, జాగ్రత్తలు పాటించ క పో వ డం, రాంగ్ రూట్లో వెళ్లడం వం టి వాటి వలన ప్రమాద ఎ క్కువ జరుగుతున్నాయని ఆయన అన్నారు.ద్విచక్ర వాహ నంపై వెళ్లే వా రు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు లో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు‌.

జాతీయ రహదారుల మీద ఎక్కు వ వేగంతో ప్రయాణించే వాహ నా లు కుడి చేతి వైపు వెళ్ళాలని, తక్కువ వేగంతో ప్ర యాణించే వా హ నాలు ఎడమవైపు వెళ్ళాలని, న డిచేవా రు కూడా పూర్తిగా ఎడమ వైపు వెళ్లాలని ఆయన అన్నారు. లారీలు ఆర్టీసీ బస్సులు మీద లోడ్ తో వెళ్లేవారు ఎడమవై పు ప్రయాణం చేయాలని తెలియజేశారు. ఆటోలో గానీ కా రులో గాని పరిమిత సంఖ్యలో ప్రయాణం చేయాలని ఎక్కు వ మంది ప్రయాణించడం వలన ఏదైనా ప్రమాదం జరిగిన ప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు పోవడం జరుగుతుంద న్నారు. గతంలో సూర్యాపేట జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులు అతివే గంతో ప్రయాణించడం వలన వా రు ప్రమాదానికి గురయ్యారని ఆ యన చెప్పారు.

మనము రోడ్డు ఎక్కేటప్పుడు కు డి వైపు ఎడమవైపు చూ సుకోవాలని అలాగే వెనుక నుంచి ఎవరు వస్తున్నారు గమ నించి వాహనాన్ని నడ పాలని ఆయన్నారు. డిఫెన్స్ డ్రై విం గ్ అంటే వెహికల్ కండిషన్ బా గుండాలి,ఇంజన్ కండిషన్ బాగుం డాలి,బ్రేకులు పనిచేస్తుందో లేదో చూసుకోవాలని, మిర్రర్స్ ఉండాలని మనము జాగ్రత్తగా వాహనం నడపా ల ని అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని అ న్నారు. ప్రతి వార్డులో కూడా వార్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తొమ్మి ది మందితో ఈ కమిటీ లు వేసి ఇందులో ముగ్గురు మహి ళలు ఉండాలని ఆయన్నారు.

ప్రతి కార్యాలయంలో కూడా నో హెల్మెట్ బోర్డులు పెట్టాలని ఆయన చెప్పా రు. ఇప్పటికే ఎస్పీ కార్యాలయం లో ఈ ని బంధన అమలు చేస్తున్నామని ఎస్పీ అన్నారు. ప్రజా ప్ర తిని ధులుగా కాలనీల నం దు యు వతను అప్రమత్తం చేసి సక్ర మ మార్గంలో నడపాల్సిన బాధ్యత ఉన్న దని గాంజా ఇ లాంటి మాదకద్ర వ్యాలకు అలవాటు పడ్డ వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించి వా రిలో మంచి ప్రవర్తన తేవాలని అ న్నారు. ప్రజల రక్షణ డ్రగ్స్ నిర్మూ లనలో పోలీస్తో  భాగస్వా మ్యం కావాలని సూచించారు.

సూర్యాపేట పట్టణ మున్సిపల్ చై ర్మన్, వైస్ చైర్మన్, కమిష నర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత చర్యలకు సంబంధించి ము న్సిపాలిటీ ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అంది స్తామని తెలిపారు. ట్రాఫిక్ సి గ్నల్ లైట్ల ఏర్పాటు ముఖ్యమై న కోడలు భద్రత చర్యలు, జీబ్రా క్రాసిం గ్ లైన్లో ఏర్పాటు లాంటి అంశాల ను పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేసే పూర్తి చేస్తామని తెలిపారు. పోలీసు వారు సూచిస్తున్న రోడ్డు నియమనిబంధనలు పాటి స్తూ ప్రజలు జాగ్రత్తగా వాహనా లు నడిపి ప్రాణ రక్షణలో ఉండాలని కోరారు.

మున్సిపాలిటీ వార్డులలో కమిటీలు ఏర్పాటు చేసి బా ధ్య తగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని హామీ ఇ చ్చారు. అలాగే సీ సీటీవీ కెమెరాల ఏర్పాటుకు ము న్సిపా లిటీ ద్వారా సహా య సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ నివే దిత లక్షాది, వైస్ చైర్మన్ సేఫి ఉల్లా, డిఎస్పీ ప్రస న్న కుమార్, ఆర్టీవో జయప్రకాశ్ రె డ్డి, మున్సిపల్ కమిషనర్ హను మం త్ రెడ్డి, ఆర్టీసీ డిఎం, సూర్యా పేట ఇన్స్పెక్టర్ వెంకటయ్య, వార్డు కౌన్సిలర్స్, స్థానిక ఎస్ఐలు, వైద్యు లు, విద్యార్థులు, పౌరులు, పోలీ సు సిబ్బంది ఉన్నారు.

Related Articles

Back to top button