Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 9:42 am Posted by : praja deveena

Suryapet Robbery Case : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట రాబరీ కే సు ఛేదన, నలుగురు నిందితుల అరెస్ట్, రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Suryapet Robbery Case : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో సంచలనం సృష్టించిన రాబరీ కేసును పోలీసులు ఛే దించారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసుల సంయుక్త చర్యలో నలుగురు నిం ది తులను అరెస్ట్ చేసి సుమారు రూ.13.35 లక్షల విలువైన బం గా రం, వెండి, వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ రాలను జిల్లా పోలీస్ కార్యాల యంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

ఈ కేసులో కంచుకొమ్ముల సంతోష్, కంచు కొమ్ముల గణేష్, షేక్ నశ్రీ న్, కంచు కొమ్ముల సాయికిరణ్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా ఆ టోలను దొంగిలించడం, దొంగిలిం చిన ఆటోలలో తిరుగుతూ ఒంట రిగా ప్రయాణించే వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, వారిని బెదిరించి ఆభరణాలు దోచుకోవడం ఆ క్రమంలో అ దే ఆటోలతో రాత్రి వేళతాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నారు.

కోటినాయక్ తండాలో వృద్ధురాలిపై రాబరీ

ఈ నెల 6వ తేదీన ఆత్మకూరు మండలం కోటి నాయక్ తం డ సమీపంలో ఒక వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకుని కొం త దూరం తీసుకెళ్లారు. అక్కడ ఆమెను చంపుతామని బెది రించి నోరు మూసి, ఆమె మెడలో ఉన్నవెండి గొలుసును దో చుకొని పారిపోయారు.ఈ ఘటనపై బాధితులు మార్చి 10 న ఆత్మ కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రాబరీ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుల కదలికలను గమనించారు.

ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలోఆత్మకూరు మం డలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు ని ర్వహిస్తుండగా TS 29 T 1190 ఆటోలో నిమ్మికల్ వైపు వె ళ్తున్న నలుగురిని అనుమా నంతో ఆపి తనిఖీ చేశారు. అ ప్పుడు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కంచుకొ మ్ముల సంతోష్,కంచుకొమ్ముల గణేష్, షేక్ నశ్రీన్, కంచు కొమ్ముల సాయి కిరణ్ లుగా గుర్తించారు. విచారణలో వీరు మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, తిప్పర్తి, పిడు గురాళ్ల, మేళ్లచెరువు, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధు ల్లో బంగారం, వెండి, ఆటోలు, బైకు లు, సెల్ ఫోన్లు దొంగతనం చేసిన ట్లు అంగీకరించారు.

     స్వాధీనం చేసుకున్న వస్తువులు

పోలీసులు నిందితుల వద్ద నుండి మొత్తం రూ.13.35 లక్షల విలు వై న వస్తువులు స్వాధీనం చేసుకు న్నారు.రూ.3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, రూ.5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి, రూ.4 లక్షల విలువైన,3ఆటోలు ట్యాబ్, ల్యాప్‌ టాప్,రూ.30 వేల విలువైన 1 బైక్, రూ.25 వేల విలువైన 1 టీ వీ రూ.30 వేల విలువైన 3సెల్ ఫోన్లు స్వాధీన పరచు కు న్నారు.

నిందితుల మధ్య సంబంధాలకు సంబంధించి ఎస్పీ తెలిపిన వివ రాల ప్రకారం A1 సంతోష్ మరి యు A4 సాయికిరణ్, అన్న ద మ్ములు కాగా A2 గణేష్ వీరి బా బాయి కొడుకు కా వడం విశేషం. ఇక A3 షేక్ నశ్రీన్ A1 సంతోష్ భార్య ఈ కే సులో A5గా షేక్ నశ్రీన్ త మ్ముడు కాగా ఇతను బాల నేర స్థుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

         నిoధితుల గత చరిత్ర

కేసులో అరెస్టైన నిందితులు A1 సంతోష్ పై కోదాడ టౌన్, కోదాడ రూరల్, వేములపల్లి, నిడమనూ రు, ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేష న్లలో 9 కేసులు ఉన్నాయి. A2 గణేష్ పై కోదాడ టౌన్‌లో 2 కే సు లు, నిడమనూర్‌లో 1 కేసు ఉం ది.A4 సాయికిరణ్ పై కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసు లు ఉన్నాయి.

అయితే కేసును విజయవంతంగా ఛేదించిన సీసీఎస్ ఇ న్స్పెక్టర్ శివకుమా ర్, సూర్యాపేట రూరల్ సీఐ రాజ శే ఖర్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, సీ సీఎస్ ఎస్సై హరికృష్ణ, టెక్ని కల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్ మరియు సిబ్బందిని జిల్లా ఎ స్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో సీసీఎస్, ఆత్మకూరు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.