TSRJC: టీ.ఎస్. ఆర్. జె.సీ ఫలితాల్లో ఎస్.వీ.ఎన్ జయకేతనం
యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్(SVN Digital School) కు చెందిన పలువురు విద్యార్థులు టీఎస్ఆర్ జె సీ లో(TSRJC) సీట్లు సాధించడం పట్ల ఎస్.వీ.ఎన్ ఫౌండర్, కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, డైరెక్టర్ గొట్టిపర్తి వృతీక్ హర్షం వ్యక్తం చేశారు.
టి ఎస్ ఆర్ జె సి లో ఆరు సీట్లు సాధించిన ఎస్.వీ.ఎన్ విద్యార్థులు
విద్యార్థులను ఘనంగా సన్మానిం చిన యాజమాన్యం
ప్రజా దీవెన, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్(SVN Digital School) కు చెందిన పలువురు విద్యార్థులు టీఎస్ఆర్ జె సీ లో(TSRJC) సీట్లు సాధించడం పట్ల ఎస్.వీ.ఎన్ ఫౌండర్, కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, డైరెక్టర్ గొట్టిపర్తి వృతీక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టి.ఎస్.ఆర్.జె.సీ లో సీట్లు సాధించిన తాడూరి కౌశిక్, ముక్కెర్ల శివాని, మాలోతు మురారి, దొడ్డి రోహిత్ కళాధర్, గుగులోతు గౌరీ,నారా అంబిక లను ఆదివారం పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి సన్మానించారు. చక్కటి ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులను పోటీ పరీక్షలకు తయారు చేయడం వల్లనే టీఎస్ ఆర్ జె సి లో ర్యాంకులు సాధించగలిగారని ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ చెప్పారు.
పటిష్టమైన ప్రణాళిక విద్యార్థులను విజయానికి చేరువ చేసిందని చెప్పారు. పదవ తరగతి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత కావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎస్.వీ.ఎన్ జయకేతనం ఎగురవేస్తున్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీఎస్ ఆర్ జె సి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి ఎస్.వీ.ఎన్ విద్యార్థులకు మొట్టమొదటగా 10వ తరగతి ప్రారంభం నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించామని చెప్పారు.
పాలిటెక్నిక్ సైనిక్ స్కూల్ తదితర పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు వారు వివరించారు. మారుమూల గ్రామీణ పేద విద్యార్థులు జయకేతనం ఎగరవేయడంలో వారి పట్టుదల ఒకవైపు ఉపాధ్యాయుల శిక్షణ మరో కారణమని అభినందించారు. 28 సంవత్సరాలలో ఎస్.వీ.ఎన్ ఎన్నో విజయాలను అందుకున్నదని చెప్పారు. ఈ సంవత్సరం పాలిటెక్నిక్ ప్రవేశ్ పరీక్షలో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించనున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎండి. యూసుఫ్,ఎస్. నవీన్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
SVN Digital School got rank in TSRJC