గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు
— సిలిండర్ ధర రూ.200 తగ్గింపు
ప్రజా దీవెన /న్యూఢిల్లీ: దేశంలో సామాన్య ప్రజలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సామాన్యులకు పోరాటం కలిగించే విధంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆయితే రక్షాబంధన్ సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రస్తుతమే అమల్లోకి రానున్న తగ్గింపు ధరలు అన్ని రకాల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు వర్తిస్తాయని తెలిపారు.
కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటిస్తూ ఉజ్వల పథకం వినియో గదారులకు గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 మేర తగ్గనుందని వెల్లడించారు.