Sweet talk for the unemployed: నిరుద్యోగులకు తీపి కబురు
-- త్వరలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ -- మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసిన క్రమంలో
నిరుద్యోగులకు తీపి కబురు
— త్వరలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్–
— మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసిన క్రమంలో
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు తీపి కబురు అందించనుంది కెసీఆర్ ప్రభుత్వం. అతి త్వరలోనే ప్రభుత్వం భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ( Govt notification for filling Anganwadi jobs) రిలీజ్ చేయనున్నట్లు గుడ్ న్యూస్ తో రుచి చూపించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 3వేలకు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా మరో 8వేల ఉద్యోగాలకు అవకాశం వస్తుందని ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ( Around 35,700 Anganwadi centers under 140 ICDS projects across the state) ఉన్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక హెల్పర్ ఉంటుండగా మినీ కేంద్రాల్లో ఒకే టీచర్ మాత్రమే ఉంటారు.
తాజాగా మినీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడంతో ( With up-gradation of Mini Kendras) అక్కడ హెల్పర్ పోస్టులు అనివార్యమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖకు అప్ గ్రేడ్ వివరాలను పంపించింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతోపాటు వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుoడనేది సమాచారం.
కేంద్రం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం కూడా చేపట్టే అవకాశముంది. అటు రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈమధ్యే ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో రెండున్న వేల మంది టీచర్లు రిటైర్డ్ కావాల్సి ఉంది. ఈ క్రమoలో అన్ని రకాల్లో కలిపి 4వేల వరకు పోస్టులు ఖాళీగా ( Up to 4000 posts are vacant in all categories) ఉంటాయనేది అంచనా.
అయితే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్లు జారీ చేసి తద్వారా భర్తీ ప్రారంభించింది. అయితే చాలా కారణాలతో భర్తీ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో ఈ క్రమంలోనే కొత్తగా 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ( Possibility of releasing notification for filling up 8000 new jobs) ఉందనేది సుస్పష్టం.