Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 1:15 pm Posted by : praja deveena

TACE treatment liver cancer : యశోదా ఆసుపత్రి వైద్యుల విజయం, లివర్ క్యాన్సర్‌కు అత్యాధునిక టేస్ చికిత్సతో రోగికి మరోజీవితం

TACE treatment liver cancer : ప్రజా దీవెన, నల్లగొండ: ‘క్యాన్సర్’ అన్న పేరు వినగానే మన సులో ఏ దో తెలియని భయం, ఆందోళన మొదలవుతాయి. ముఖ్యంగా లి వర్ క్యాన్సర్ (హెపటోసెల్యులార్ కార్సి నో మా) విషయంలో ఈభయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రారంభ దశలో బయ టపడటం చాలా కష్టం. అలసట, కడు పునొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించేసరికే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. కానీ, ఆ ధునిక వైద్యశాస్త్రం ఇప్పుడు ఈ భ యాలను పటాపంచలు చేస్తోంది. దానికి ని దర్శనమే, మలక్‌పేట్ య శోదా సూపర్ స్పెషాలిటీ ఆసుప త్రి లో చోటుచేసుకున్న ఈ విజయగాథ ఇలా ఉంది.

ఆసుపత్రికి వచ్చిన 60 ఏళ్ల ఆ వ్య క్తి పరిస్థితి ఏమంత ఆ శాజనకంగా లేదు. లివర్ క్యాన్సర్‌తో పాటు, ఇప్పటికే క్రానిక్ లివర్ డిసీజ్, డయా బెటిస్, అధిక రక్తపోటుతో ఆయన బా ధపడుతున్నారు. రోగి వయసు, ఇతర ఆరోగ్య సమస్యల ను దృష్టి లో ఉంచుకుంటే, సాధారణ శస్త్రచి కిత్స చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, యశోదా వై ద్య బృందం ఒక సంచలనా త్మక నిర్ణయం తీసుకుంది. అదే టేస్ (Transarterial Chemoe mbolization) అంటే ఏ మిటీ TA CE ఎలా పని చేస్తుంది. ఇది ఒక మినిమల్ ఇన్వే సివ్ (తక్కువ శస్త్ర చికిత్సతో కూడిన) ప్రక్రియ. డా. సంకేత్ కులకర్ణి (ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్) నేతృత్వంలో జరిగి న ఈ విధానంలో, వైద్యులు అద్భుత మైన నైపుణ్యాన్ని ప్రద ర్శించారు.

ట్యూమర్‌కు రక్త సరఫరా చేసే నా ళాలను ఖచ్చితంగా గు ర్తించారు. నేరుగా ఆ నాళాల ద్వారా కీమో థెరపీ మందుల ను ట్యూమర్‌లోకి పంపించారు. తద్వారా ట్యూమర్‌కు అం దే రక్త సరఫరాను అడ్డుకు న్నారు. దీనివల్ల ఆరోగ్యకరమైన లి వర్ కణజాలానికి ఏమాత్రం హాని జరగకుండా, కేవలం ట్యూమర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దానిని నియం త్రించగలిగారు.ఒక రోగికి కేవలం క్యాన్సర్ చికిత్స మాత్రమే సరిపోదు, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సమర్థవంతం గా నిర్వహించాలి. అందుకే, యశోదా ఆసుపత్రికి చెందిన వి విధ విభాగాల నిపుణులు కలిసి ఈ చికిత్సను పర్యవేక్షించా రు.

నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, డ యాబెటాలజీ విభాగాల వైద్యులు సమన్వయంతో పనిచేయడంవల్లే, ఆ రోగి ఎలాం టి దుష్ప్రభావాలు లే కుండా కోలుకున్నారు. కాగా లివర్ క్యాన్సర్ చికిత్సలో TACE ఒక గే మ్ ఛేంజర్,” అని మెడికల్ ఆంకా లజిస్ట్ డా. రోహిత్ రెడ్డి ఎల్ అభిప్రాయపడ్డారు. శస్త్ర చికిత్స అవస రం లేకుండానే, లక్ష్యిత చికిత్స ద్వారా ట్యూ మర్‌ను నియంత్రించడం రోగికి కొత్త ఆశను ఇచ్చిందని ఆయన బుధవారం నల్లగొండ లో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో పేర్కొన్నారు.

భవిష్యత్తుకు భరోసానిస్తూ నేడు ఆ రోగి సురక్షితంగా, ఆరో గ్యంగా ఇంటికి చేరుకున్నారు. ఈ విజయగాథ వైద్యరం గం లో వస్తున్న మార్పులకు నిదర్శనం. యశోదా ఆసుపత్రి యా జమాన్యం చెబుతున్న ట్లుగా అత్యాధునిక సాంకేతికత, ని పుణులైన వైద్యులు, సమగ్ర చికి త్సా విధానంతోడైతే క్లిష్టమై న క్యా న్సర్ వ్యాధులను కూడా జయించ వచ్చు.లివర్ క్యా న్సర్ పట్ల అప్రమ త్తంగా ఉండి, సకాలంలో స్క్రీనింగ్ చే యించుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాల నుండి ప్రాణాల ను కాపాడుకోవచ్చని ఈ ఘటన మరో సారి గుర్తు చేస్తోంది.

ఇదిలా ఉండగా మలక్‌పేట్ యశో దా సూపర్ స్పెషాలిటీ ఆ సుపత్రి డై రెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివా స్ రెడ్డి, అసోసి యే ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మా ట్లాడుతూ యశోదా ఆసుపత్రు లు అత్యాధునిక సాంకేతిక త, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, సమగ్ర చికిత్స విధా నాలతో క్లిష్టమైన క్యాన్సర్ కేసులను విజయవంతంగా నిర్వ హిస్తున్నాయని తెలిపారు.

సమయానికి సరైన నిర్ధారణ, ఆధునిక చికిత్సా విధానాలు, వైద్య బృందాల సమన్వయం ద్వారా రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందించడం తమ ప్రధాన లక్ష్య మని, భవిష్యత్తులో కూడా అ త్యు త్తమ వైద్య సేవలను అందిం చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.