Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 3:13 pm Posted by : praja deveena

tamilnadu cm Vijay oath confirm : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం, ఉత్కంఠతకు వాతావరణానికి తెర 

tamilnadu cm Vijay oath confirm : ప్రజా దీవెన, చె న్నై: తమిళనాడు రాజకీ యాల్లో ఉత్కంఠ భరితంగా సాగు తున్న పరిణామాలు ఇ ప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. సినీ స్టార్ విజయ్ నేతృ త్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పా టుకు మార్గం సుగ మ మ వుతోందన్న సంకేతాలు రాష్ట్ర రా జకీయాలను హీట్‌ఎక్కిస్తు న్నా యి. తగిన సంఖ్యాబలాన్ని సమీకరించిన విజయ్, త్వ రలోనే గవర్నర్ ఆ ర్వీ ఆర్లేకర్‌ను మరోసారి కలవను న్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇప్పటికే రెండు రోజులుగా జరిగిన చర్చల అనంతరం“మ్యా జిక్ ఫిగర్‌ తో రండి” అని గవర్నర్ సూచించడంతో టీవీకే శిబిరం వే గంగా మద్దతు కూ డగట్టే పనిలో పడింది.

ఇప్పటికే టీవీకేకు 108 మంది ఎ మ్మెల్యేల మద్దతు ఉండ గా, కాం గ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మె ల్యేలు విజయ్ వై పు రావడంతో ఆ సంఖ్య 113కు చేరింది. ఇక ప్రభుత్వం ఏ ర్పాటు కోసం అవసరమైన చివరి ఆరు సీట్లు ఇప్పుడు రా జకీయ గేమ్‌చేంజర్లుగా మారాయి.అక్కడే ఎంట్రీ ఇచ్చాయి వీసీకే, సీ పీఐ, సీపీఎం పార్టీలు ఈ మూడు పార్టీలకు కలిపి ఉన్న ఆరు ఎమ్మె ల్యేలు ఇప్పుడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థితిలో నిలిచారు. పార్టీ వర్గాల స మాచారం ప్రకారం వీసీకేకు చెం దిన ఇద్దరు ఎమ్మెల్యేలు, సీ పీఐకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీ ఎంకు చెందిన ఇద్ద రు ఎమ్మెల్యేలు

టీవీకేకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. మద్దతు లేఖల తో కలిసి విజయ్ గవర్నర్‌ను కలవనున్నార ని సమాచారం. ఈ పరిణామాలతో తమిళనాడు లో “సినిమా స్టార్ నుంచి సీఎం వ రకూ” విజయ్ ప్రయాణం నిజమ య్యే దిశగా అడు గులు పడుతు న్నాయన్న చర్చ జోరందుకుంది. ఇక ఫోర్ట్ సె యింట్ జార్జ్‌లో టీవీకే జెండా ఎగరవేస్తుందా? లేక చివరి ని మిషంలో మరో ట్విస్ట్ ఎదురవు తుందా? అన్న ఆసక్తి రాష్ట్ర వ్యా ప్తంగా నెలకొంది.