Nara Lokesh phone tapping : నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయు డు, టీడీపీ యువనేత నారా లోకేష్ సెల్ ఫోన్ ట్యాపింగ్ కు గురైంది.
ఆపిల్ సంస్థ అలర్ట్ తో బహిర్గతం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయు డు, టీడీపీ యువనేత నారా లోకేష్ సెల్ ఫోన్ ట్యాపింగ్ కు గురైంది. ప్రముఖ ఆపిల్ సంస్థ అలెర్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆపిల్ సంస్థ నారా లోకేష్‌కు సెక్యూరిటీ అలెర్ట్ పంపిన నేపద్యంలో అసలు విషయం బహిర్గతమైంది.
ఆపిల్ లోకేష్ ఫోన్‌కు ట్యాపింగ్, హ్యాకింగ్ అలెర్ట్ నోటిఫికేషన్ పంపింది. ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరు గుతుందని ఆపిల్ నుంచి ఈమెయిల్ అందింది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్‌కు సూచన చేసింది. దీంతో ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా తాజాగా యాపిల్ సంస్థ అలెర్ట్ తో రచ్చకు దారితీసిం